close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పీపీఈ కిట్లు ధరించి.. ప్రగతిభవన్‌ ఆకస్మిక ముట్టడి

ఖైరతాబాద్‌, గాంధీభవన్‌, గోషామహల్‌, న్యూస్‌టుడే: కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు బుధవారం ఆకస్మికంగా ప్రగతిభవన్‌ని ముట్టడించారు. పీపీఈ కిట్లు ధరించి.. ఒక వాహనంలో ప్రగతి భవన్‌ ముందే దిగారు. పోలీసులు వారిని కరోనా రోగులుగా భావించి తొలుత తటపటాయించినట్లు సమాచారం. ఈలోగానే ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్‌రావు ప్రగతి భవన్‌ ముందున్న గ్రిల్స్‌ ఎక్కి లోపలికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఆయనతో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహల్‌ స్టేడియానికి తరలించారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పోలీసులు వెంకట్‌రావు సహా 29 మందిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కార్యకర్తల అరెస్టును కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. ఎలాంటి కేసులు లేకుండా వారిని విడిచిపెట్టాలని డిమాండ్‌ చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఈ మేరకు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పరామర్శించేందుకు గోషామహల్‌ స్టేడియానికి వచ్చిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వీహెచ్‌, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎం.విక్రమ్‌గౌడ్‌ తదితరులు స్టేడియానికి రాగా పోలీసులు అడ్డుకున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.