నీలగిరిలో వీరబల్లాలుని శాసనాలు
close

ప్రధానాంశాలు

నీలగిరిలో వీరబల్లాలుని శాసనాలు

నల్గొండ, న్యూస్‌టుడే: తమిళనాడు ప్రాంతం కంచి ప్రాంతానికి చెందిన వీరబల్లాలుని కాలం నాటి శాసనాలు నల్గొండలో ఉన్నట్టు చరిత్రకారులు గుర్తించారు. తెలంగాణ చరిత్ర పరిశోధన బృందం సభ్యుడు యాదగిరి తదితరులు నల్గొండ పట్టణం పాతబస్తీలోని అశోక్‌నగర్‌ కోటమైసమ్మ ఆలయాన్ని శనివారం దర్శించారు. కాపురాల గుట్టపైకి ఉన్న కోట దారిలోని ఈ ఆలయాన్ని కోటమైసమ్మగా స్థానికులు పిలుస్తారని, ఆలయంలోని రాతి పలకపై భైరవుడు, గండ భేరుండ, పులి శిల్పాలు ఉన్నాయని, ఇవి తమిళనాడు రాష్ట్రం కంచికి చెందిన వీరబల్లాలుని కాలం నాటివిగా గుర్తించామని వెల్లడించారు. 3వ హోయసల వీరబల్లాలుడు అనేక చోట్ల ఇలాంటి శాసనాలు చెక్కించిన ఆధారాలు ఉన్నాయని గుర్తించామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని