Drone: 43 కి.మీ.. 32 నిమిషాలు.. తక్కువ వ్యవధిలో డ్రోన్‌తో మందుల సరఫరా

ప్రధానాంశాలు

Drone: 43 కి.మీ.. 32 నిమిషాలు.. తక్కువ వ్యవధిలో డ్రోన్‌తో మందుల సరఫరా

కొడంగల్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌ నుంచి కొడంగల్‌కు రోడ్డు మార్గంలో 53 కిలోమీటర్ల దూరం.. అదే ఆకాశ మార్గంలో అయితే 43 కి.మీ ఉంటుంది. ఈ దూరాన్ని 32 నిమిషాల్లో డ్రోన్‌ ప్రయాణించి మందులను చేరవేసింది. దీంతో దేశంలోనే అత్యంత దూర ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లయిందని హైదరాబాద్‌ అపోలోకు చెందిన మారుతి డ్రోన్‌ కంపెనీ ప్రతినిధి ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. శనివారం వికారాబాద్‌ కొడంగల్‌ సివిల్‌ ఆసుపత్రికి మందులు సరఫరా చేసేందుకు డ్రోన్‌తో మొదటిసారి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. జిల్లా ఆసుపత్రి నుంచి ఏరియా ఆసుపత్రులకు స్వల్ప వ్యవధిలో మందులు చేరవేసేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపారు. మొత్తం 16 కిలోల బరువున్న బాక్సులను పంపవచ్చన్నారు. కంపెనీ ప్రతినిధులు సురేష్‌పెద్ది, రాములు, కొడంగల్‌ సివిల్‌ ఆసుపత్రి వైద్యులు వీణ, శ్రావణి పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని