close
గాలి నుంచి నీరు 

సరికొత్త హైడ్రోజెల్‌ను తయారుచేసిన అమెరికా శాస్త్రవేత్తలు

హ్యూస్టన్‌: గాలిలోని తేమ నుంచి నీటిని సృష్టించే వినూత్న వ్యవస్థను అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నీరు తాగడానికి యోగ్యంగా ఉంటుందని వారు చెప్పారు. విపత్తులు తలెత్తినప్పుడు, నీటి సంక్షోభం ఉన్న ప్రాంతాల్లోను, వర్ధమాన దేశాల్లోను వీటిని ఉపయోగించవచ్చని వివరించారు. 
ఈ విధానంలో హైడ్రోజెల్స్‌ను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఇవి సూపర్‌ స్పాంజీలా వ్యవహరిస్తాయి. భారీ పరిమాణంలో నీటిని ఒడిసిపడతాయి. వేడి చేస్తే ఆ నీటిని విడుదల చేస్తాయి. ఈ ప్రత్యేకత తేమ, పొడి వాతావరణ పరిస్థితుల్లో అద్భుతంగా పనికొస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గాలి నుంచి తాగునీటిని ఉత్పత్తి చేయడానికి అక్కరకొస్తుందని చెప్పారు. గాల్లో 5లక్షల ఘనపు కిలోమీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. వీటిని ఈ కొత్త వ్యవస్థ విజయవంతంగా ఒడిసిపడుతుంది. ఈ వ్యవస్థ చిన్నగా ఉంటుందని, ధర కూడా తక్కువేనని శాస్త్రవేత్తలు తెలిపారు. 
ఈ హైడ్రోజెల్‌ను ఆరు బయట ఉంచితే గాలి నుంచి నీటిని ఒడిసిపడుతుంది. ఆ తర్వాత దీన్ని ఐదు నిమిషాల పాటు ఎండలో ఉంచితే ఆ నీరు విడుదలవుతుంది. కిలో హైడ్రోజెల్‌తో రోజుకు 50 లీటర్ల వరకూ నీటిని ఉత్పత్తి చేయవచ్చని పరీక్షల్లో తేలింది.

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.