close
యాంటిబయాటిక్స్‌తో నాడులకు దెబ్బ

లండన్‌: శ్వాసకోశ సమస్యలు, మూత్రకోశం అంటురోగాలు (ఇన్‌ఫెక్షన్లు) తగ్గడానికి వాడే యాంటిబయాటిక్స్‌ వల్ల నాడులు దెబ్బ తింటాయని డూండీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. నరాలు తీవ్రంగా, శాశ్వతంగా దెబ్బ తినడానికి 50 శాతం అవకాశాలున్నాయని నిర్ధరించారు. ఫ్లూరోక్వీనోలిన్‌ లేదా అమోక్సిసిలిన్‌- క్లావులనేట్‌ అనే యాంటిబయాటిక్స్‌ వాడిన 1.3 మిలియన్ల మంది రోగుల సమాచారాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వీరికి చికిత్స ప్రారంభంలో నాడుల వ్యాధి (పెరిఫెరల్‌ న్యూరోపతి)ని నిర్ధరించలేదు. యాంటిబయాటిక్స్‌ వాడిన తరువాత వ్యాధికి గురైనట్లు గమనించారు. అమోక్సిసిలిన్‌- క్లావులనేట్‌ వాడినవారి కంటే ఫ్లూరోక్వీనోలిన్‌ వాడినవారిలోనే ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. పరిశోధన వివరాలు ‘జామా న్యూరాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.