Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120957
            [news_title_telugu_html] => 

నిధుల్లేక నిస్సత్తువ 

[news_title_telugu] => నిధుల్లేక నిస్సత్తువ  [news_title_english] => [news_short_description] => నిధుల్లేక రాష్ట్రంలో మండల పరిషత్‌లను నిస్సత్తువ ఆవరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందకపోతుండటం... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32, ) )
నిధుల్లేక నిస్సత్తువ  - EENADU
close
నిధుల్లేక నిస్సత్తువ 

కేరళలో బ్లాక్‌ పంచాయతీలకు 15 శాతం నిధులు 
కర్ణాటక, మరికొన్ని రాష్ట్రాల్లోనూ మెరుగైన విధానాలు 
రాష్ట్రంలో నీరసించిపోయిన మండల పరిషత్‌లు 
పనులేవీ చేయకుండానే ముగుస్తున్న సభ్యుల పదవీకాలం 
ఈనాడు - హైదరాబాద్‌

 

నిధుల్లేక రాష్ట్రంలో మండల పరిషత్‌లను నిస్సత్తువ ఆవరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందకపోతుండటం వల్ల కొన్నేళ్లుగా వాటి ద్వారా గ్రామీణులకు ఒనగూరిన ప్రయోజనాలంటూ ఏవీ కనిపించటంలేదు. కేంద్రం నాలుగేళ్ల క్రితం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి పథకాన్ని నిలిపివేయటంతో దాని ద్వారా అంతవరకు అందుతూ వచ్చిన నిధులూ నిలిచిపోయాయి. రాష్ట్రంలో 536 మండల పరిషత్‌లు జులై నెలలో కొలువుతీరబోతున్నాయి. ఇప్పుడైనా నిధులుంటేనే మండల వ్యవస్థకు మళ్లీ జవసత్వాలు వస్తాయి. పాత పాలకవర్గాల పదవీకాలం జులై4 వరకు ఉన్నందున ఆ తర్వాతనే కొత్త పాలకవర్గాలు అధికార పగ్గాలను చేపడతాయి. 
నివేదికలను పట్టించుకోని పంచాయతీరాజ్‌ శాఖ 
రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన మూడు అంచెల వ్యవస్థలో మధ్యస్తంగా ఉండేవే మండల పరిషత్‌లు. వీటిని మిగతా రాష్ట్రాల్లో బ్లాక్‌ పంచాయతీలు, తాలుకా పంచాయతీలుగా వ్యవహరిస్తుంటారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో బాగా ఉండటంతో ఇక్కడి అధికారులు, ప్రజా ప్రతినిధులు తరచూ ఆయా రాష్ట్రాలకు వెళ్లి నివేదికలను ఇస్తున్నా వాటి ఆధారంగా తీసుకొనే చర్యలు మాత్రం శూన్యం. కేరళ రాష్ట్ర సర్కారు తన బడ్జెట్‌లో 40 శాతం మేర స్థానిక సంస్థలకే కేటాయిస్తుంది. ఇందులో 15 శాతం బ్లాక్‌ పంచాయతీలకు వెళ్తాయి. 
పెరిగిన బాధ్యతలు 
ఒక పంచాయతీ పరిధిలోని పనులను అక్కడి సర్పంచి చేపట్టినప్పటికీ.. వివిధ పంచాయతీల మధ్య అనుసంధాన రోడ్ల వంటి పనులను మాత్రం ఎంపీపీలే చేపట్టాలి. తెలంగాణలో ఇప్పుడు పంచాయతీల సంఖ్య 12,751కి పెరిగినందున అనుసంధాన రోడ్ల అవశ్యకత మునపటికంటే ఎక్కువగా ఉంది. భగీరథ నీళ్లు వచ్చినా మంచినీటి సమస్యలు తప్పక ఉంటాయని, ఒకటికంటే ఎక్కువ పంచాయతీలకు కలిపి సమస్య ఉత్పన్నమైనప్పుడు దాన్ని పరిష్కరించాల్సిందీ మండల పరిషత్తేనని ఒక అధికారి పేర్కొన్నారు. గతంలో గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్‌లకూ దిల్లీ నుంచి నిధులు అందేవి. దిల్లీ నిధులు నేరుగా పంచాయతీలకు మాత్రమే ఇవ్వాలంటూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయటంతో గత నాలుగేళ్లగా మండల పరిషత్‌లను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. స్థానిక సంస్థలకు సిఫార్సు చేసే నిధుల్లో 15 శాతం మండల పరిషత్‌లకు ఇవ్వాలంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తిని 14వ ఆర్థిక సంఘం పెడచెవినపెట్టింది.  మాజీ మంత్రి రాజేశం గౌడ్‌ నేతృత్వంలోని రాష్ట్ర ఆర్థిక సంఘం ఇప్పటికే సర్కారుకు ఒక మధ్యంతర నివేదికను ఇవ్వగా అందులో గ్రామ పంచాయతీల నిధులనే ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిసింది. తుది నివేదిక వెలువడాల్సివుంది. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నివేదిక 2020 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తుంది. 
కొత్త చట్టంలో కొన్ని విధులు ఇలా.. 
నిధుల మాటెలా ఉన్నా.. రాష్ట్ర పంచాయతీరాజ్‌ నూతన చట్టం మాత్రం మండల పరిషత్‌ల అధికారాలు, విధులనూ కొంత మేర విస్తృతం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నిర్వహణ, పిల్లలకు 14 ఏళ్లు పూర్తయ్యేవరకు విద్యను అందించేందుకు కృషి చేయటం, శిశు సంక్షేమ కేంద్రాలను నిర్వహించటం, రక్షిత తాగునీటిని అందించటం, మురుగుకాలువల ఏర్పాటు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటివి ఇందులో ఉన్నాయి. 
అయిదేళ్లలో ఒక్క పనీ చేయలేదు 
నేను కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి మండలం ఆత్మకూరు ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నాను. దీని పరిధిలో రెండు పంచాయతీలు ఉన్నాయి. గడచిన అయిదేళ్లలో నేను ఒక్క పని కూడా చేయించలేకపోయా. నేనే కాదు.. రాష్ట్రంలోని ఏ ఎంపీటీసీ సభ్యుడిని కదిపినా కళ్లనీళ్లపర్యంతమయ్యే స్థితి నెలకొంది. గతంలో బీఆర్‌జీఎఫ్‌ పథకం ఉన్నప్పుడు ఒక్కో ఎంపీటీసీ సభ్యుడు రూ.5 లక్షలకు పైగా విలువైన పనులను సిఫార్సు చేసేందుకు వీలయ్యేది. నాలుగేళ్ల క్రితం ఆ పథకం నిలిచిపోయింది. మండల పరిషత్‌లకు నిధులను అందజేయాలంటూ దిల్లీలో ధర్నాసైతం నిర్వహించాం. ప్రస్తుతం సర్పంచి, ఎమ్మెల్యే మాత్రమే శక్తివంతులై ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు మారాలి.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.