Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120970
            [news_title_telugu_html] => 

తేడాలెందుకు వచ్చాయి? 

[news_title_telugu] => తేడాలెందుకు వచ్చాయి?  [news_title_english] => [news_short_description] => ఏపీలోని పలు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల సంఖ్యకు, తుది ఫలితాల్లో ప్రకటించిన ఓట్లకు మధ్య ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32, ) )
తేడాలెందుకు వచ్చాయి?  - EENADU
close
తేడాలెందుకు వచ్చాయి? 

పోలైన ఓట్లకు... ఫలితాల్లో ప్రకటించిన వాటికి వ్యత్యాసం

ఈనాడు, అమరావతి: ఏపీలోని పలు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల సంఖ్యకు, తుది ఫలితాల్లో ప్రకటించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఈ తేడా వందల్లో ఉండగా... మరికొన్ని చోట్ల వేలల్లో ఉంది. అధికారిక గణాంకాల్లోనే ఇలా తేడాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 12వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పోలింగ్‌ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. ఏ శాసనసభ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న గణాంకాలను అందులో పేర్కొంది. తాజాగా ప్రకటించిన ఫలితాలను పరిశీలిస్తే చాలా నియోజకవర్గాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. కొన్ని చోట్ల పోలైన ఓట్ల కంటే ఫలితాలు ప్రకటించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండగా. ..మరికొన్ని చోట్ల తక్కువగా ఉంది. దీనికి సహేతుక కారణాలున్నాయని...అనవసర సందేహాలు అవసరం లేదని రిటర్నింగ్‌, ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. అలా  వ్యత్యాసాలు ఎందుకొచ్చాయనే దానిపై రిటర్నింగ్‌ అధికారుల నుంచి వివరణ కోరుతామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. 
రిటర్నింగ్‌ అధికారులు చెబుతున్న కారణాలివీ 
ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని ఈవీఎంలు మోరాయించాయి. బ్యాటరీ పనిచేయక మరికొన్నింటిని తెరిచేందుకు వీలు లేకపోయింది.  మాక్‌పోల్‌ అనంతరం కంట్రోల్‌ యూనిట్లలోని ఓట్లను జీరో చేయకుండానే...పోలింగ్‌ ప్రారంభించారు. ఆయా కేంద్రాల్లోని ఈవీఎంలను లెక్కించకుండా పక్కన పెట్టేశారు. 
ఆ కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థులకు, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటే చివర్లో కూడా వాటిని లెక్కించలేదు. వాటిల్లో పోలైన ఓట్ల వివరాలను ఫలితాల సమయంలో కలపలేదు. 
ఏపీలోని 700కు పైగా కేంద్రాల్లో ఏప్రిల్‌ 11న రాత్రి 9.15 గంటల తర్వాత కూడా పోలింగ్‌ సాగింది. అలాంటి చోట్ల పోలైన ఓట్లకు సంబంధించి తొలుత ప్రాథమిక గణాంకాలు ఇచ్చి...ఆ తర్వాత పూర్తి స్థాయలో వివరాలు వెల్లడించారు. 
పోలింగ్‌ రోజున ఆయా నియోజకవర్గాల పరిధిలోని కేంద్రాలన్నింటిలో పోలైన ఓట్లను క్రోడీకరించే క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లాయి.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.