Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120993
            [news_title_telugu_html] => 

కమలం ప్రయోగించిన సామాజిక అస్త్రం 

[news_title_telugu] => కమలం ప్రయోగించిన సామాజిక అస్త్రం  [news_title_english] => [news_short_description] => సార్వత్రిక ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల్లోని అనేక చిన్న పార్టీలతో భాజపా పొత్తులు పెట్టుకుంది. ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32, ) )
కమలం ప్రయోగించిన సామాజిక అస్త్రం  - EENADU
close
కమలం ప్రయోగించిన సామాజిక అస్త్రం 

కొత్త వర్గాల చేతికి అధికార దండం 
వివిధ రాష్ట్రాలలో భాజపా ప్రయత్నం 
సార్వత్రిక ఎన్నికల్లో చిన్న పక్షాలతో పొత్తు 
ఫలించిన సోషల్‌ ఇంజినీరింగ్‌ మంత్రం

సార్వత్రిక ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల్లోని అనేక చిన్న పార్టీలతో భాజపా పొత్తులు పెట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌ వైమానిక దాడుల్లాంటి జాతీయతాభావాన్ని రేకెత్తించే అంశాలతో పాటు ఈ అస్త్రాన్నీ సమర్ధంగా ఉపయోగించుకుంది. మిగిలిన రాజకీయ పక్షాలు ఎన్నికలకు సుమారు ఏడాది ముందు నుంచి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే, భాజపా మాత్రం 2014 ఎన్నికల తర్వాతి నుంచే ఈ ప్రయత్నాలు ప్రారంభించింది. దీని ప్రభావం ఎంత ఉందనేది ఫలితాలు వెలువడిన తర్వాత గానీ తెలియదు. దీని పేరే.. సోషల్‌ ఇంజనీరింగ్‌! 2014 నుంచి జరిగగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ప్రస్తుత లోక్‌సభ  ఎన్నికల్లోనూ ఈ సోషల్‌ ఇంజనీరింగ్‌ అస్త్రాన్ని భాజపా ప్రయోగించింది. చాలా రాష్ట్రాల్లో ఇది సత్ఫలితాలనిస్తే కొన్ని చోట్ల బెడిసికొట్టింది. దేశంలో దాదాపు 14% జనాభాతో బలమైనవర్గంగా ఉన్న ముసింలను పూర్తిగా విస్మరించడం ఈ సోషల్‌ ఇంజనీరింగ్‌లో భాజపా అనుసరించిన ప్రధాన వ్యూహం. భాజపా మాజీ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ గోవిందాచార్య తొలిసారిగా సోషల్‌ ఇంజనీరింగ్‌ అనే పదాన్ని ఉపయోగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి పార్టీలోకి ’90ల చివరికాలంలో ఆయన వచ్చారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల తర్వాతి కాలంలో ఓబీసీ వర్గాల్లోకి భాజపా విస్తరణ కోసం ఆయన ‘సోషల్‌ ఇంజనీరింగ్‌’ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ మంత్రాన్ని పాటించి, భాజపా పలు విజయాలు సాధించింది. రాష్ట్రాల్లో ఉన్న బలమైన కులాల నుంచి ముఖ్యమంత్రులను ఎంపిక చేసుకునే సంప్రదాయాన్ని ఆ పార్టీ వదిలిపెట్టింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఈ తరహా ప్రయోగాలు చేసింది. 2014 అక్టోబరులో మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను పడగొట్టి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అక్కడ సామాజికంగా లేదా రాజకీయంగా బలమైన వర్గాలవారు కారు. ఇదే మంత్రంతో గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లోనూ లోక్‌సభలో అత్యధిక స్థానాలు సాధించి తన సత్తా నిరూపించింది.

మహారాష్ట్రలో బ్రాహ్మణులు 
మహారాష్ట్రకు రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా యువకుడైన దేవేంద్ర ఫడణవీస్‌ను ఎంపికచేశారు. ఇక్కడ మరాఠాలు, దళితులు, ఓబీసీలు ప్రధానవర్గాలు. అందుకే ఫడణవీస్‌ హయాంలో మరాఠాలు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. కానీ ఆయన వాటిని సమర్ధంగా నియంత్రించారు. ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చూశారు. భాజపా - శివసేన పొత్తు కూడా ఖరారు కావడంతో ప్రస్తుత ఎన్నికల్లో ఫడణవీస్‌ లెక్కలు బాగానే ఉన్నాయి.
హరియాణాలో ఖత్రీలు 
పంజాబీ ఖత్రీ అయిన మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను భాజపా హరియాణా ముఖ్యమంత్రిగా నియమించింది. ఆయన గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌. ఆ రాష్ట్రంలో ఆధిపత్య వర్గం జాట్లు. వారు కూడా చేతిలో అధికారం లేకపోవడంతో నిరసనలు వెల్లువెత్తించారు. ఖట్టర్‌ యువకుడు కాదు, రాజకీయంగా బలమైన నాయకుడూ కాదు. అయినా.. ఉప ఎన్నికలలో మాత్రం భాజపా మంచి ఫలితాలే సాధించగలిగింది. మహారాష్ట్ర, హరియాణాలలో ఆధిపత్యవర్గానికే అధికారం ఇవ్వాలన్న భావన నుంచి భాజపా బయటపడింది. ఎప్పుడూ అధికారాన్ని అనుభవిస్తూ ఉండే ప్రభావవంతమైన, ఆయా ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ఉన్న వర్గాలకు కాకుండా వేరేవారికి కట్టబెట్టింది.
ఝార్ఖండ్‌లో ఇలా.. 
తర్వాత ఝార్ఖండ్‌లోనూ అలాంటి ప్రయోగమే చేసింది. 2014 డిసెంబరులో అక్కడ భాజపా గెలిచింది. బిహార్‌ నుంచి విడివడి, 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటివరకు గిరిజనులే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. భాజపా మాత్రం వెనుకబడిన వర్గాలకు చెందిన రఘువర్‌దాస్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది. ఈసారి గిరిజనుల ఓట్లు తమకు పడకపోవచ్చన్న యోచనతో గిరిజనేతరుల ఓట్లను సమీకరించింది. ఫలితంగా ఆ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో అత్యధికం గెలిచింది.
యూపీలో ఠాకుర్లు 
ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను ఉన్నతవర్గమైన ఠాకుర్ల నుంచి ఎంపికచేశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో యాదవేతర ఓబీసీల మద్దతుతో భాజపా ఘనవిజయం సాధించింది. ఏ ఒక్క కులానికి లేదా వర్గానికి వీటో తరహా అధికారం ఇవ్వకూడదన్న ఆర్‌ఎస్‌ఎస్‌ యోచనలకు అనుగుణంగానే ఈ ముఖ్యమంత్రులందరి నియామకాలు జరిగాయి.
గుజ్జర్లు, జాట్లు ఇటువైపే 
రాజస్థాన్‌లో రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, గుజ్జర్ల ఉద్యమ నాయకుడు కిరోరిసింగ్‌ బైంస్లాను పార్టీలో చేర్చుకోవడం ద్వారా భాజపా తన సోషల్‌ ఇంజినీరింగ్‌ను  మరోసారి తెరమీదకు తెచ్చింది. జనాభాలో 12% ఉన్న జాట్లు, 9% ఉన్న గుజ్జర్ల ఓటుబ్యాంకుపై కన్నేసింది. వీటితోనే లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ ఘన విజయం సాధించింది. అసెంబ్లీలో అధికారం కోల్పోయినా లోక్‌సభ ఎన్నికలలో మాత్రం అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. జాట్లు, గుజ్జర్లు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో ఉన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది.
ఎస్సీ ఎస్టీల అండతో 
మధ్యప్రదేశ్‌లో అప్పటివరకు ఉన్న పార్టీతీరును 1998 ప్రాంతంలోనే నరేంద్రమోదీ మార్చారు. కొత్తతరం నాయకత్వాన్ని తెరమీదకు తెచ్చారు. వారిలో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు. ఆయన ప్రయత్నాలకు పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనే కొంత వ్యతిరేకత వచ్చింది. అయినా గిరిజనులు, ఓబీసీలు, ఎస్సీల నుంచి నాయకులను ఎన్నుకున్నారు. అది తర్వాత సత్ఫలితాలనిచ్చింది. 2003లో ఉమాభారతి, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ లాంటి నాయకులు ఉద్భవించారు. ఈ వ్యూహాల ఫలితంగానే మోదీకి ‘మాస్టర్‌ సాబ్‌’ అనే పేరు వచ్చింది.

ముస్లిం అభ్యర్థులేరీ? 

తమకు ఏమాత్రం ఓట్లు రావనుకున్న వర్గాలను ఎన్నికల రణరంగం నుంచి భాజపా పూర్తిగా దూరం పెట్టింది. ఉదాహరణకు దేశ జనాభాలో 14 శాతానికి పైగా ఉన్న ముస్లింలకు అతి తక్కువ సంఖ్యలో టికెట్లు కేటాయించింది. భాజపా, దాని మిత్రపక్షాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా ముస్లింలకు ఇచ్చిన స్థానాలు 9 మాత్రమే. అసోంలో 1, బిహార్‌లో 2, జమ్మూకశ్మీర్‌లో 3, పశ్చిమబెంగాల్‌లో 2, లక్షద్వీప్‌లో 1 చొప్పున ముస్లింలను అభ్యర్థులుగా నిలబెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌ లాంటి పెద్ద రాష్ట్రం సహా అనేక రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎన్డీయే జాబితాలో లేకపోవడం ప్రస్తావనార్హం. వేరే వర్గాలకు చెందిన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ముస్లిమేతర ఓట్ల ఏకీకరణను భాజపా సాధించగలిగింది. బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో యాదవేతర బీసీ వర్గాలను దగ్గరకు చేర్చుకుంది. తద్వారా ఆయా వర్గాలలో ఉన్న ఓట్లన్నీ గంపగుత్తగా తమ కూటమికి పడేలా చూసుకుంది.

ఫలించిన పథకం 

ఈసారి ఎన్నికలలో కూడా భాజపా అనుసరించిన సోషల్‌ ఇంజినీరింగ్‌ మంత్రం ఫలించింది. ఈ విషయం సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నిరూపితమైంది. ఆధిపత్య వర్గాలను, తమకు ఓటు వేయరనుకున్న వారిని పక్కన పెట్టడం సాహసోపేతమే. తన సామాజిక ప్రయోగంతోనే వివిధ రాష్ట్రాల్లోని చిన్నపార్టీలతో పొత్తులు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌ లాంటి పెద్ద రాష్ట్రాలు ప్రయోగాలకు అంత అనుకూలమైనవి కావు. అవి ఎంతవరకు సత్ఫలితాలనిస్తాయో.. ఎక్కడ దెబ్బకొడతాయో చెప్పలేరు. అయినా మోదీ-షా జంకలేదు. ఝార్ఖండ్‌లో గిరిజనేతరులు, హరియాణాలో జాటేతరులు, ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం హిందూ ఓట్లతో అధిక స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు, అలాగే సాధించి చూపించారు కూడా.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.