Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 121021
            [news_title_telugu_html] => 

‘కోటా’లో పాగా! 

[news_title_telugu] => ‘కోటా’లో పాగా!  [news_title_english] => [news_short_description] => భాజపా విజయపథంలో ఇదో మైలు రాయి! దళితులు, గిరిజనులు కాంగ్రెస్‌ సానుభూతిపరులనీ, వారి ఓటు బ్యాంకు వల్లే ఆ పార్టీ చాలాకాలం పాటూ పలు రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉందన్న విశ్లేషణలున్నాయి. కానీ, 1989 లగాయతు ఇప్పటివరకూ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే భాజపాయే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలను ఎక్కువగా కైవసం చేసుకొంది. 1989-2014 మధ్య రిజర్వుడు స్థానాల నుంచి మొత్తం 976 మంది ప్రజాప్రతినిధులు ఎంపికవ్వగా- వారిలో 290 మంది... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32, ) )
‘కోటా’లో పాగా!  - EENADU
close
‘కోటా’లో పాగా! 

ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో అత్యధిక సీట్లు భాజపావే...

భాజపా విజయపథంలో ఇదో మైలు రాయి! దళితులు, గిరిజనులు కాంగ్రెస్‌ సానుభూతిపరులనీ, వారి ఓటు బ్యాంకు వల్లే ఆ పార్టీ చాలాకాలం పాటూ పలు రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉందన్న విశ్లేషణలున్నాయి. కానీ, 1989 లగాయతు ఇప్పటివరకూ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే భాజపాయే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలను ఎక్కువగా కైవసం చేసుకొంది. 1989-2014 మధ్య రిజర్వుడు స్థానాల నుంచి మొత్తం 976 మంది ప్రజాప్రతినిధులు ఎంపికవ్వగా- వారిలో 290 మంది భాజపా తరఫున, 277 మంది కాంగ్రెస్‌ నుంచి ఎన్నికవ్వడం చరిత్రాత్మకం. తాజా ఎన్నికల్లోనూ ఆయా నియోజకవర్గాల్లో కమలం పార్టీయే ఆధిపత్యం చాటుకుంది. 
అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో... ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు కొన్ని స్థానాలను కేటాయిస్తూ వస్తోంది. 1951 నుంచి 1984 వరకూ జరిగిన ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీయే ఆధిపత్యం చాటుకున్నా, ఆ తర్వాత క్రమంగా ఫలితాల దృశ్యం మారిపోయింది! 1996, 1998, 1999, 2004, 2014, 2019 ఎన్నికల్లో అత్యధిక ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కాషాయ పార్టీయే కంచు మోగించింది. 
అగ్రవర్ణాల వల్లే? 
కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చిన అగ్రవర్ణాలు 1989 ఎన్నికల్లో భాజపాకు మద్దతిచ్చారు. దీంతో అప్పటివరకూ లోక్‌సభలో రెండు స్థానాలు మాత్రమే ఉన్న కాషాయపార్టీ ఒక్క ఉదుటన 85 స్థానాలు ఒడిసిపట్టింది. వీటిలో 18 రిజర్వుడు నియోజకవర్గాలు ఉండటం విశేషం. సరిగ్గా ఆ ఎన్నికల నుంచే కాంగ్రెస్‌ పార్టీ క్రమంగా చిక్కిపోతూ వస్తోంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు అన్న మాటేగానీ... అక్కడ ఆ సామాజికవర్గాల ఓట్లు సగటున 40-45% మాత్రమే ఉంటున్నాయి. దీంతో అక్కడి అగ్రవర్ణాలంతా కలిసి ఒక్క మాటగా భాజపాకు మద్దతిస్తున్నాయి. 
ఉన్నత సామాజికవర్గాల వారి మధ్య ఉన్నంత ఐక్యత దళితులు, గిరిజనుల్లో లేదు. రిజర్వుడు స్థానాల్లో ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు ఆయా పార్టీల నుంచి బరిలో ఉంటున్నారు. దీంతో ఓట్లన్నీ చీలిపోతున్నాయి. చివరికి బీసీలు, అగ్రవర్ణాలు ఎవరికి మద్దతు పలికితే వారు విజయం సాధిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 84 ఎస్సీ, 47 ఎస్సీ స్థానాలున్నాయి.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.