Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 135673
            [news_title_telugu_html] => 

అణ్వస్త్రాలను పెంచుకుంటున్న పాక్‌, చైనా

[news_title_telugu] => అణ్వస్త్రాలను పెంచుకుంటున్న పాక్‌, చైనా [news_title_english] => [news_short_description] => చైనా, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియాలు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తమ అణ్వస్త్రాలను పెంచుకున్నాయి. భారత్‌ తదితర దేశాలు మాత్రం ఈ మారణాయుధాలను అదే సంఖ్యలో కొనసాగించడమో తగ్గించడమో చేశాయని అంతర్జాతీయ మేధోమథన సంస్థ ‘ద స్టాక్‌హోమ్‌.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32, ) )
అణ్వస్త్రాలను పెంచుకుంటున్న పాక్‌, చైనా - EENADU
close
అణ్వస్త్రాలను పెంచుకుంటున్న పాక్‌, చైనా

భారత ఆయుధాల సంఖ్య యథాతథం
ప్రపంచవ్యాప్తంగా తగ్గుదల
 ఆధునికీకరణపై దృష్టి

స్టాక్‌హోమ్‌: చైనా, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియాలు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తమ అణ్వస్త్రాలను పెంచుకున్నాయి. భారత్‌ తదితర దేశాలు మాత్రం ఈ మారణాయుధాలను అదే సంఖ్యలో కొనసాగించడమో తగ్గించడమో చేశాయని అంతర్జాతీయ మేధోమథన సంస్థ ‘ద స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (సిప్రీ) తన వార్షిక పుస్తకంలో పేర్కొంది.
గణనీయంగా పెంచుకునేందుకు..
చైనా, భారత్‌, పాకిస్థాన్‌లు తమ అణ్వాయుధాగారాల పరిమాణాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని సిప్రీలోని అణ్వస్త్ర నియంత్రణ కార్యక్రమం డైరెక్టర్‌ షానన్‌ కైల్‌ తెలిపారు. ముఖ్యంగా భారత్‌, పాక్‌లు తమ సైనిక అణు విచ్ఛిత్తి పదార్థాల ఉత్పత్తిని విస్తరించుకుంటున్నాయని, తద్వారా వచ్చే దశాబ్దకాలంలో తమ అణ్వాయుధాగారాన్ని గణనీయంగా పెంచుకుంటాయని పేర్కొన్నారు.

మొత్తం మీద తగ్గుదల
మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అణ్వస్త్రాల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, భారత్‌, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియా వద్ద మొత్తం 13,865 అణ్వస్త్రాలు ఉన్నాయి. 2018 ప్రారంభంతో పోలిస్తే ఈ సంఖ్య 600 మేర తగ్గింది. అయితే చాలా దేశాలు తమ అణ్వాయుధాగారాలను ఆధునికీకరిస్తున్నాయి. ‘‘సంఖ్య తగ్గుతోంది. అయితే కొత్త ఆయుధాలు వస్తున్నాయి’’ అని  షానన్‌ కైల్‌ తెలిపారు. ప్రధానంగా ఈ తగ్గుదలకు కారణం అమెరికా, రష్యాలే. ప్రపంచ అణ్వస్త్రాల్లో ఈ రెండు దేశాలకు కలిపి 90 శాతం వాటా ఉంది. 2010లో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్‌’ ఒప్పందం మేరకు ఈ దేశాలు తమ ఆయుధగారాలను కుదించుకుంటున్నాయి. ఈ ఒప్పందం 2021లో ముగుస్తుంది. అయితే దాన్ని పొడిగించుకునేందుకు చర్చలకు ప్రయత్నాలేమీ జరగడంలేదని కైల్‌ తెలిపారు. మొత్తంమీద ప్రపంచ వ్యాప్తంగా 13,865 అణు బాంబుల్లో 3750 అణ్వస్త్రాలు ప్రయోగానికి సిద్ధంగా మోహరించి ఉన్నాయి. దాదాపు 2వేల అస్త్రాలు అప్రమత్త స్థితిలో ఉంచారు.

భారత్‌, పాక్‌ సరిహద్దులపై ఆందోళన
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)కి వచ్చే ఏడాదితో 50 ఏళ్లు నిండుతాయి. 1980ల మధ్యలో అణు వార్‌హెడ్ల సంఖ్య 70వేలుగా ఉండేది. నాటితో పోలిస్తే ప్రస్తుతం అవి బాగా తగ్గాయి. ఇది మంచి పురోగతే అయినప్పటికీ భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి అణ్వాయుధ మోహరింపు వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని కైల్‌ తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య సంప్రదాయ పోరు అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందన్నారు. దీనికితోడు ఐదేళ్ల కిందటితో పోలిస్తే అమెరికా వంటి దేశాలు తమ వ్యూహాత్మక పత్రాల్లో అణ్వస్త్రాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు.

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.