close
20 ఎకరాల స్థలం.. రూ.10 కోట్ల నిధి! 

ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుకు నిబంధన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు నెలకొల్పాలనుకుంటే నగరపాలకసంస్థల పరిధిలో 20 ఎకరాలు, ఇతర ప్రాంతాల్లో అయితే 30 ఎకరాలు తప్పనిసరి. రూ.10 కోట్ల కార్పస్‌ నిధి ఉండాలి. ఈ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో దీనిపై మార్గదర్శకాలు జారీ కానున్నాయని చెబుతున్నారు.

రిలయన్స్‌ వచ్చేనా?:  తెలంగాణలో రిలయన్స్‌ గ్రూపు ప్రపంచస్థాయి సౌకర్యాలతో.. మార్కెట్‌ డిమాండ్‌ కోర్సులతో విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఆ సంస్థ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఆ సంస్థ నవీ ముంబయిలో 700 ఎకరాల విస్తీర్ణంలో జియో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్‌ గ్రూపు తెలంగాణలో మరో వర్సిటీని ప్రారంభిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.