close
చదువుకున్నోడికి చదువుకున్నంత 

ఒకేసారి బహుళ డిగ్రీలు చేసే అవకాశం 
అధ్యయనానికి యూజీసీ కమిటీ

దిల్లీ: ఒకసారి ఒకటే కోర్సు చేసే సంప్రదాయ పద్ధతులకు కాలం చెల్లుతోంది. ప్రస్తుతతరం ఒకటి కంటే ఎక్కువ కోర్సులు చదివి, తక్కువ సమయంలోనే ఎక్కువ పరిజ్ఞానం పొందాలని చూస్తోంది. అందుకే.. ఒకే సమయంలో ఒక విశ్వవిద్యాలయం లేదా వేర్వేరు వర్సిటీల నుంచి బహుళ డిగ్రీలు చేసే అవకాశం విద్యార్థులకు ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై విశ్వవిద్యాలయాల గ్రాంట్ల కమిషన్‌ (యూజీసీ) దృష్టిసారించింది. దూరవిద్య, ఆన్‌లైన్‌ లేదా పార్ట్‌టైంలలో ఏదో ఒక విధానం ద్వారా ఒకేసారి బహుళ డిగ్రీలు చేయడానికి ఎంతవరకు వీలవుతుందో పరిశీలించి నివేదిక ఇవ్వడానికి యూజీసీ ఉపాధ్యక్షుడు భూషణ్‌ పట్వర్ధన్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కమిటీ పని మొదలైందని యూజీసీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

2012లో కూడా ఈ అంశంపైనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి నాటి హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఫర్ఖాన్‌ ఖమర్‌ నేతృత్వం వహించారు. రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ చదివే విద్యార్థి ఒకే సమయంలో గరిష్ఠంగా ఒక అదనపు డిగ్రీని దూరవిద్య విధానంలో చదవొచ్చని ఆ కమిటీ సూచించింది. రెగ్యులర్‌ విధానంలో ఒకేసారి రెండు డిగ్రీలను అనుమతించకూడదని, దానివల్ల రవాణా, పరిపాలన, విద్యాపరమైన సమస్యలొస్తాయని చెప్పారు. రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ చదివే విద్యార్థి దాంతోపాటు గరిష్ఠంగా ఒక సర్టిఫికెట్‌ కోర్సు, లేదా డిప్లొమా, లేదా అడ్వాన్స్డ్‌డిప్లొమా, లేదా పీజీ డిప్లొమా కోర్సులను చదవొచ్చని ఆ కమిటీ తన నివేదికలో తెలిపింది. ఈ కమిటీ నివేదికపై వివిధ చట్టబద్ధ మండళ్ల నుంచి అభిప్రాయాలు కోరగా, ఇలా ఒకేసారి రెండు డిగ్రీలకు అవకాశం ఇచ్చే విధానాన్ని సమర్థించలేదు. దాంతో అప్పట్లో దీన్ని అమలుచేయడం సాధ్యం కాలేదని యూజీసీ అధికారులు తెలిపారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందడంతో ఇదే ఆలోచనపై మరోసారి చర్చిస్తున్నామన్నారు. రెగ్యులర్‌ డిగ్రీతో పాటు ప్రత్యేక కోర్సులు కూడా చేయాలనుకునే వాళ్లు చాలామంది ఉంటున్నారని, అందుకే ఇది చర్చకు వచ్చిందని చెప్పారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.