Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179050
            [news_title_telugu_html] => 

పచ్చదనానికి బలరాముడు

[news_title_telugu] => పచ్చదనానికి బలరాముడు [news_title_english] => [news_short_description] => నిరుపేద కుటుంబం నుంచి ఉన్నతాధికారిగా ఎదిగిన ఆయన పర్యావరణ పరిరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32, ) )
పచ్చదనానికి బలరాముడు - EENADU
close
పచ్చదనానికి బలరాముడు

నిరుపేద కుటుంబం నుంచి ఉన్నతాధికారిగా ఎదిగిన ఆయన పర్యావరణ పరిరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజూవారీ విధులకు హాజరవుతూనే ఖాళీ సమయాల్లో వేలాది మొక్కలు నాటుతున్నారు. సివిల్‌ సర్వీసులో ఐఆర్‌ఎస్‌ విభాగానికి ఎంపికైన బలరాం సింగరేణి సంస్థలో సంచాలకుడిగా పనిచేస్తున్నారు. హరితహారం పథకంలో భాగంగా తానొక్కరే సొంతంగా ఐదు వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని నాలుగు నెలల్లో 4220 మొక్కలు నాటారని సింగరేణి సంస్థ తెలిపింది. గత నెల 20న శ్రీరాంపూర్‌లో ఉపరితలగని మట్టి కుప్పలపై గంట వ్యవధిలో 1257 మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. అదే రోజు జైపూర్‌ విద్యుత్కేంద్రంలో మరో 501 మొక్కలు నాటారు. ఈ రికార్డు హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో నమోదైంది. పాలమూరు జిల్లా తిరుమలగిరికి చెందిన హున్య, కెస్లీ దంపతుల ఏడుగురు సంతానంలో పెద్దవాడైన బలరాం చిన్నతనంలో పేదరికం వల్ల కూలి పనులు చేశారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే వివాహమైనా కుటుంబ భారం మోస్తూనే చదువు కొనసాగించారు. 2010లో సివిల్స్‌ రాసి రెవెన్యూ విభాగానికి ఎంపికయ్యారు. ముంబయిలో కస్టమ్స్‌శాఖలో ఉప కమిషనర్‌గా పనిచేసి అనంతరం సింగరేణికి వచ్చారు.

-ఈనాడు, హైదరాబాద్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.