Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179051
            [news_title_telugu_html] => 

మోసాలు విత్తుకుంటాయ్‌

[news_title_telugu] => మోసాలు విత్తుకుంటాయ్‌ [news_title_english] => [news_short_description] => విత్తన విక్రయ వ్యాపారులకు మరింత స్వేచ్ఛనిస్తూ కేంద్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం లైసెన్సు చెల్లుబాటు కాలవ్యవధి మూడేళ్లు.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32, ) )
మోసాలు విత్తుకుంటాయ్‌ - EENADU
close
మోసాలు విత్తుకుంటాయ్‌

విత్తన వ్యాపారులకు మరింత స్వేచ్ఛ
ఒక్కసారి లైసెన్సు తీసుకుంటే ఐదేళ్లు బేఫికర్‌
విత్తన నియంత్రణ ఉత్తర్వులకు కేంద్రం సవరణ
కంపెనీల ఒత్తిళ్లతో మారిన నిబంధనలు

ఈనాడు, హైదరాబాద్‌: విత్తన విక్రయ వ్యాపారులకు మరింత స్వేచ్ఛనిస్తూ కేంద్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం లైసెన్సు చెల్లుబాటు కాలవ్యవధి మూడేళ్లు ఉండగా ఇకనుంచి ఐదేళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ‘జాతీయ విత్తన నియంత్రణ ఉత్తర్వు-1983’(ఎస్‌సీఓ)కు సవరణ చేస్తున్నట్లు తెలుపుతూ రాష్ట్ర వ్యవసాయశాఖకు ఆదేశాలిచ్చింది. దీనివల్ల వ్యాపారులపై నిఘా తగ్గుతుందని వ్యవసాయాధికారులు సైతం వాపోతున్నారు. ఇప్పటికే నాసిరకం, నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులను పక్కా ఆధారాలతో పట్టుకున్నా వారిపై కేసులు పెట్టి లైసెన్సు రద్దు చేయాలంటే కష్టాలు తప్పడంలేదని సీనియర్‌ రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. ఇప్పుడున్న విధానంలో మూడేళ్లకో మారు లైసెన్సు పొడిగించేందు(రెన్యువల్‌)కు రాష్ట్ర వ్యవసాయశాఖకు దరఖాస్తు చేసి రూ.వెయ్యి రుసుం చెల్లిస్తే చాలు. ఇలా రెన్యువల్‌కు వచ్చినప్పుడు మూడేళ్లలో వారి విత్తన అమ్మకాలెలా ఉన్నాయనే చరిత్రను పరిశీలించి తప్పుడు పనులు చేసినట్లు గుర్తించే అవకాశముంటుంది. తప్పుడు పనుల జాబితాలో ఉన్నవారికి రెన్యువల్‌ చేయకుండా రాష్ట్ర వ్యవసాయశాఖ ఆపే అవకాశం ఉంది. ఇలా చేస్తున్నారనే ఐదేళ్లకో గడువు పెంచేలా విత్తన కంపెనీలు కేంద్ర వ్యవసాయశాఖ వద్ద లాబీయింగ్‌ చేసినట్లు తెలుస్తోంది.

లైసెన్సే వద్దని..
విత్తన వ్యాపారులకు లైసెన్సుల విషయంలో దిల్లీ కేంద్రంగా కొంతకాలంగా లాబీయింగ్‌ జరుగుతోంది. విత్తనాల విక్రయాలు ‘నిత్యావసరాల చట్టం-1955’ పరిధిలో ఉన్నాయి. ఈ చట్టం కింద ఉన్నవాటిని విక్రయించేందుకు లైసెన్సు అవసరం లేదని, రద్దు చేయాలని పలు కంపెనీలు కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖను అడిగింది. లైసెన్సులుంటేనే నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను నష్టపరుస్తున్నారని, ఇక లైసెన్సులే లేకపోతే మరింత కష్టమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కేంద్రానికి స్పష్టం చేసింది. వాస్తవానికి లైసెన్సు రెన్యువల్‌ చేసుకునే ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున అది పెద్ద పని కాదు. ఒకసారి నాసిరకం అమ్ముతూ పట్టుబడితే మళ్లీ రెన్యువల్‌కు కష్టమవుతుందని వ్యాపారులు కంపెనీల ద్వారా లైసెన్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని గట్టిగా కోరుతున్నారు. చివరికి రాష్ట్రాల అభిప్రాయాలకనుగుణంగా లైసెన్సు రద్దు చేయడానికి బదులు మూడేళ్ల నుంచి ఐదేళ్లకు రెన్యువల్‌ గడువును పొడిగిస్తూ విత్తన నియంత్రణ సవరణ ఉత్తర్వు-2019ను జారీ చేసిందని సీనియర్‌ అధికారి చెప్పారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.