Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179072
            [news_title_telugu_html] => 

అమ్మ భాషకు.. అక్షర తిలకం

[news_title_telugu] => అమ్మ భాషకు.. అక్షర తిలకం [news_title_english] => [news_short_description] => తెలుగు భాషలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషనల్‌ టెక్నాలజీ(ఐఐఐటీ)-హైదరాబాద్‌ శ్రీకారం చుట్టింది. అరకొరగా ఉన్న తెలుగు వికీపీడియాను బలోపేతం చేసే మహాక్రతువును చేపట్టింది. దీనికి కేంద్ర సమాచార సాంకేతికశాఖ ఆమోదం లభించగా.. తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది. మాతృభాషలో వ్యాసాల సంఖ్యను రానున్న ఆరేళ్లలో 30 లక్షలకు పెంచాలన్న భారీ సంకల్పంతో ఐఐఐటీ పనిచేస్తోంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32, ) )
అమ్మ భాషకు.. అక్షర తిలకం - EENADU
close
అమ్మ భాషకు.. అక్షర తిలకం

తెలుగు వికీపీడియా బలోపేతానికి ఐఐఐటీ శ్రీకారం
ఆరేళ్లలో 30 లక్షల వ్యాసాలు అందుబాటులోకి తెచ్చే క్రతువు
కేంద్ర సమాచార శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహకారం

తెలుగు భాషలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషనల్‌ టెక్నాలజీ(ఐఐఐటీ)-హైదరాబాద్‌ శ్రీకారం చుట్టింది. అరకొరగా ఉన్న తెలుగు వికీపీడియాను బలోపేతం చేసే మహాక్రతువును చేపట్టింది. దీనికి కేంద్ర సమాచార సాంకేతికశాఖ ఆమోదం లభించగా.. తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది. మాతృభాషలో వ్యాసాల సంఖ్యను రానున్న ఆరేళ్లలో 30 లక్షలకు పెంచాలన్న భారీ సంకల్పంతో ఐఐఐటీ పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టులో తెలుగు అధ్యాపకులు, పరిశోధకులు, సాహితీవేత్తలు, రచయితలు, విద్యార్థులు, ఎన్జీవోలు.. ఇలా మాతృభాషపై పట్టున్న ప్రతి వర్గాన్నీ ప్రాజెక్టులో భాగస్వాముల్ని చేసి సమగ్రమైన తెలుగు వికీపీడియాను అందుబాటులోకి తేనుంది. ప్రఖ్యాత ఆచార్యులు రాజిరెడ్డి ఆశయాల మేరకు ఈ ప్రాజెక్టు చేపట్టగా ముఖ్య పరిశోధకులుగా ఆచార్య వాసుదేవవర్మ వ్యవహరిస్తున్నారు.

2001లో ఆంగ్ల వికీపీడియా ప్రారంభమైంది. 2003 డిసెంబరు 10 నుంచి తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చింది. ఆంగ్లంలో సుమారు 70 లక్షలకు పైగా వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి. నిత్యం ఏదో ఒక వ్యాసాన్ని రచయితలు అప్‌లోడ్‌ చేయడం, ఇప్పటికే ఉన్న అంశాలను అప్‌డేట్‌ చేయడం చేస్తుంటారు. తెలుగు వికీపీడియాలో మాత్రం సమాచారం ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటివరకు 71,100 వ్యాసాలే అందుబాటులో ఉన్నాయి. వికీపీడియాలో వ్యక్తం చేసే సందేహాల్లో దేశంలో తెలుగు వీక్షకులవే ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పటికే ఆంగ్లంలో ఉన్న వ్యాసాలను తెలుగులోకి తర్జుమా చేస్తే చదువుకోవడానికి వీలుంటుంది. సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలకు సమాచారం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగు వికీపీడియాను బలోపేతం చేస్తున్నారు.

ఏం చేస్తారు..?
* ఈ క్రతువులో భాగంగా రెండు విధాలుగా ముందుకెళ్లనున్నారు. మొదటిది.. ఇప్పటికే ఆంగ్లంలో ఉన్న వ్యాసాలను తెలుగులోకి అనువదిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ టూల్స్‌ను ఐఐఐటీ అభివృద్ధి చేస్తోంది. ఆంగ్లంలో ఉన్న అంశాలు తెలుగీకరించేందుకు ఇవి ఉపకరిస్తాయి. అలా అనువాదం చేశాక మూడు దశల్లో ప్రూఫ్‌ రీడింగ్‌ చేసి తప్పులను సరిచేస్తారు. అనంతరం ఆ అంశాన్ని వికీపీడియాలో అప్‌లోడ్‌ చేస్తారు. ఆన్‌లైన్‌లో అనువాదం చేయనుండటంతో యంత్రం కూడా ఎప్పటికప్పుడు కొత్త పదాలు తెలుసుకుని తప్పులు సరిదిద్దుకుంటుంది.
* రెండో విధానంలో సమాజంలోని అందరినీ భాగస్వాముల్ని చేసుకుని వివిధ అంశాలపై తెలుగులో వ్యాసాలు రాయించి అప్‌లోడ్‌ చేసేలా ప్రోత్సహిస్తారు. ఔత్సాహికులు తమకు అందుబాటులో ఉన్న తెలుగు టైపింగ్‌ టూల్స్‌ను వినియోగించి వ్యాసాలు రాసి ఐఐఐటీ అందించే ఫాంట్‌ కన్వర్టర్‌ సాయంతో యూనికోడ్‌ కిందకు మార్చి అప్‌లోడ్‌ చేయవచ్చు. సులువుగా తెలుగు టైపింగ్‌ చేసే టూల్స్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువస్తారు.

తెలుగు తర్వాత అన్ని భాషల్లోనూ..
ప్రపంచంలోని ఎన్నో అంశాలను తెలుగు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో తెలుగు వికీపీడియా బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఆచార్య రాజిరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. దీనిద్వారా మాతృభాషలోనే ఆన్‌లైన్‌లో సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఇది నిరంతర క్రతువుగా ఏళ్ల తరబడి కొనసాగుతుంది. మా పరిశోధన ఒక్క తెలుగుకే పరిమితం కాదు. దేశంలోని 12-13 భాషాల్లో వికీపీడియాను బలోపేతం చేయాలనేది లక్ష్యం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది.

-ఆచార్య వాసుదేవవర్మ, ప్రాజెక్టు ముఖ్య పరిశోధకులు, ఐఐఐటీ

ఈనాడు - హైదరాబాద్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.