Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219008786
            [news_title_telugu_html] => 

అవయవాల నిల్వకాలం పెంపునకు కొత్త విధానం

[news_title_telugu] => అవయవాల నిల్వకాలం పెంపునకు కొత్త విధానం [news_title_english] => [news_short_description] => అవయవ మార్పిడిని సులభతరం చేసే ఒక వినూత్న విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సేకరించిన అవయవాన్ని ఎక్కువ సమయం పాటు నిల్వ చేసే వెసులుబాటు ఈ విధానంతో సాధ్యమవుతుంది. ఫలితంగా మరింత ఎక్కువ మంది రోగుల ప్రాణాలను కాపాడటానికి వీలవుతుంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,33,32, ) )
అవయవాల నిల్వకాలం పెంపునకు కొత్త విధానం - EENADU
close
అవయవాల నిల్వకాలం పెంపునకు కొత్త విధానం

వాషింగ్టన్‌: అవయవ మార్పిడిని సులభతరం చేసే ఒక వినూత్న విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సేకరించిన అవయవాన్ని ఎక్కువ సమయం పాటు నిల్వ చేసే వెసులుబాటు ఈ విధానంతో సాధ్యమవుతుంది. ఫలితంగా మరింత ఎక్కువ మంది రోగుల ప్రాణాలను కాపాడటానికి వీలవుతుంది. సాధారణంగా దాత అవయవాలను ఐస్‌లో దాదాపు 4 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిల్వ చేస్తారు. అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతకు చల్లబరిస్తే ఆ అవయవం మరింత ఎక్కువ కాలం పాటు మనుగడ సాగించగలదు. అయితే సున్నా డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అవయవంలో మంచు స్ఫటికాలు ఏర్పడుతుంటాయి. దీనివల్ల అది దెబ్బతింటుంది. తాజా పద్ధతిలో ప్రత్యేక రసాయనాలను ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు ఐదు మానవ కాలేయాలను మైనస్‌ 4 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిల్వ చేశారు. దీంతో ఈ అవయవ నిల్వ కాలం 9 గంటల నుంచి 27 గంటలకు పెరిగింది. ప్రయోగ సమయంలో ఐదు కాలేయాలపై ఎలాంటి ఐస్‌ ఏర్పడలేదు. వాటి పనితీరు సాధారణంగానే ఉన్నట్లు గుర్తించారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.