close
పొద్దుతిరుగుడు గింజలతో విటమిన్‌-ఇ

ఈనాడు డిజిటల్‌, చెన్నై: పొద్దు తిరుగుడు గింజలను ఉపయోగించి శక్తిమంతమైన విటమిన్‌-ఇని సృష్టించవచ్చని ఐఐటీ మద్రాస్‌ బయోటెక్నాలజీ విభాగం ఆచార్యులు పరిశోధనల్లో గుర్తించారు. ఆచార్యులు కార్తీక్‌ రామన్‌, స్మితా శ్రీవాత్సవ ఈ పరిశోధనలో ముఖ్య భూమిక పోషించారు. విటమిన్‌-ఇ ఉత్పత్తికి వీరు కొత్త మార్గాలను కనుగొన్నారు. సన్‌ఫ్లవర్‌ గింజలతో విటమిన్‌- ఇని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయొచ్చని, ఇప్పుడు మనకు లభిస్తున్న విటమిన్‌-ఇతో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చని తేల్చారు. సాధారణంగా రసాయనికంగా విత్తనాలను ఉపయోగించి ప్రయోగ శాలల్లో విటమిన్‌-ఇని ఉత్పత్తి చేస్తారు. సన్‌ఫ్లవర్‌లో విటమిన్‌-ఇని ఉత్పత్తి చేయగల ఒక జన్యువు ఉంటుంది. దాన్ని మరో మొక్కలోకి చొప్పించి కొత్త దానిని ఉత్పత్తిచేసే విధానం కనుగొన్నారు. దీనికి బయోటెక్నాలజీ మాత్రమే కాకుండా కంప్యూటర్‌ మోడలింగ్‌, సెల్యులార్‌ ఇంజినీరింగ్‌ వంటి పద్ధతుల్లోనూ పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనను బయోకెమికల్‌ ఇంజినీరింగ్‌ జర్నల్‌ అనే అంతర్జాతీయ పరిశోధక పత్రికలో ప్రచురించారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.