close
బ్యాటరీలు ఇక పేలవు

లిథియం అయాన్‌ బ్యాటరీలు లేని ప్రపంచాన్ని ప్రస్తుతం ఊహించలేం. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు తదితర ఉపకరణాలకు శక్తిని అందించడంలో ఇవే కీలకం. కానీ ఈ బ్యాటరీల్లో ఒక లోపం ఉంది. అప్పుడప్పుడూ పేలుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రకం బ్యాటరీలు పేలడానికి, మంటలు వేగంగా విస్తరించడానికి ఆస్కారముండే పదార్థాలతో తయారవుతున్నాయి. ఇలాంటి బ్యాటరీలతో తయారైన కొన్ని రకాల ఫోన్లు, ఈ-సిగరెట్లు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను విమానాలు, ఓడలు, జలాంతర్గాముల్లో నిషేధించారు కూడా. ఈ లోపం లేని లిథియం అయాన్‌ బ్యాటరీలను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పగుళ్లు వచ్చినా, నీటిలో మునిగిపోయినా, వేడెక్కిపోయినా ఈ బ్యాటరీకి ఏం కాదట!  జాన్‌ హాప్కిన్స్‌ అప్లైడ్‌ ఫిజిక్స్‌ లేబొరేటరీ పరిశోధకులు...మంటల ముప్పులేని వాటర్‌-ఇన్‌-సాల్ట్‌ (విస్‌), వాటర్‌-ఇన్‌-బైసాల్ట్‌ (విబ్స్‌) ఎలక్ట్రోలైట్స్‌ను ఉపయోగించి సరికొత్త లిథియం-ఆయాన్‌ బ్యాటరీని రూపొందించారు. ఫోన్లతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాల్లోనూ త్వరలోనే ఇవి వినియోగంలోకి వస్తాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.