close
కాలువ గలగల.. కట్ట విలవిల

కృష్ణానదీ పరీవాహకంలో భారీ వర్షాలు కురవడంతో నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. ఈ ఏడాది ఆగస్టు 11 నుంచి ఎడమకాల్వకు నీటి విడుదల కొనసాగుతోంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ కాలువ 135 కిలోమీటర్ల మేర ఉంటుంది. వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసి కొన్ని సంవత్సరాలుగా కాలువ పొడవునా లైనింగ్‌ పూర్తి చేశారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల కాంక్రీటు పనులు చేయడం కష్టమంటూ మట్టికట్టలను అలాగే వదిలేశారు. కాల్వలో నీరు ప్రవహిస్తుండటంతో లైనింగ్‌ చేయని చోట్ల మట్టికట్టలు కోతలకు గురై నీరు వృథాగా పోతోంది. ఈ ఏడాది జలాశయంలో పుష్కలంగా నీరుండటంతో రెండో పంటకు కూడా ఎడమ కాల్వ ద్వారా నీరు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మట్టికట్టలు మరింత కోతకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు మట్టికట్టలు ఉన్నచోట శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

- ఈనాడు, నల్గొండ

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.