close
వీసా చెల్లుబాటయ్యేంత వరకు ఉండొచ్చు!

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి...

ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి మారాలనుకుంటున్నాను. హెచ్‌1బీ వీసాను బదలాయించేందుకు నూతన యాజమాన్యం పిటిషన్‌ దాఖలు చేయనుంది. దాని ఆమోదానికి ముందు ప్రస్తుత హెచ్‌1బీ వీసాపై భారతదేశం వెళ్లవచ్చా?

- శ్రీమాన్‌ తిరుమల

 

అమెరికాలో పిటిషనర్‌ వద్ద మీకు చెల్లుబాటయ్యే ఉద్యోగం ఉన్న పక్షంలో ప్రస్తుత హెచ్‌1బీ వీసాపై మీరు ప్రయాణం చేయవచ్చు. మీ నూతన పిటిషన్‌ ఆమోదం పొందే సమయంలో మీరు అమెరికా బయట ఉన్నట్లయితే నూతన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం www.uscis.gov చూడండి.


నాకు హెచ్‌-4 వీసా ఉంది. ప్రస్తుతం నేను గర్భవతిని. భారతదేశంలో ఉన్నాను. ఇక్కడ ఎన్ని నెలలు ఉండవచ్చు?

- అలివేణి ఎమ్‌ఎన్‌

అమెరికా తిరిగి వెళ్లేందుకు చెల్లుబాటయ్యే వీసా ఉన్నంత కాలం మీరు భారతదేశంలో ఉండవచ్చు. మరింత సమాచారం కోసం  https://www.ustraveldocs.com/in   పరిశీలించండి.


2021 వరకు చెల్లుబాటయ్యే పర్యాటక వీసా ఉంది. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేద్దామనుకుంటున్నా. ఎఫ్‌-1 వీసా ఆమోదిస్తే పర్యాటక వీసా పరిస్థితి ఏమిటి?

- చంద్ర మన్నం

బీ1/బీ2 వీసా ఉన్నప్పటికీ అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు ఎఫ్‌-1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఆమోదం పొందినప్పటికీ మీ బీ1/బీ2 వీసాను రద్దు చేయరు. వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇంటర్వ్యూ అపాయింటుమెంటు షెడ్యూల్‌ చేసుకునేందుకు  https://www.ustraveldocs.com/in ను చూడండి. అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ వెబ్‌సైట్‌  https://educationusa.state.gov,  యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ https://www.usief.org.in  పరిశీలించమని సూచిస్తాం.


ఎఫ్‌-1 వీసాను పొందాను. ఆరు నెలల తరవాత ఆ వీసాను మిస్సౌరీ స్టేట్‌ యూనివర్సిటీకి  మార్చుకోవాలనుకుంటున్నా. ఎఫ్‌-1 వీసాను బదలాయించుకునే విధానం ఏమిటి?

- కృష్ణకిషోర్‌ ఎం

విశ్వవిద్యాలయం, విద్యా కార్యక్రమం, ఎస్‌ఈవీఐఎస్‌ నంబరులో ఏది మారినా ఎఫ్‌-1 వీసాదారులు నూతన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. అమెరికాలో చదువుకుని అయిదు నెలలు దాటినా నూతన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. అమెరికాలోకి ప్రవేశానుమతి, ఎంత కాలం ఉండాలన్న అంశాలను యూఎస్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీకి చెందిన కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌(సీఈపీ) నిర్ణయిస్తుంది.

* వీసాలకు సంబంధించిన నిర్దిష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను supportn-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి.
* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌  http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు.
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.