close
ఓజోన్‌ రంధ్రం ఈ ఏడాది తగ్గింది

వాషింగ్టన్‌: భూమి మీద జీవజాలాన్ని రక్షించే ఓజోన్‌ పొరలోని రంధ్రం పరిమాణం ఈ ఏడాది చాలా తక్కువగా ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. గత 40 ఏళ్లలో ఇదే అత్యల్పం. అయితే దీనర్థం ఈ పొర కోలుకుంటున్నట్లు కాదు, గత రెండు నెలల్లో భూ ఎగువ వాతావరణంలో నెలకొన్న అసాధారణ వేడి పరిస్థితుల కారణంగానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఉపగ్రహ డేటా ఆధారంగా నాసా, నోవా సంస్థలు ఈ నిర్ధారణకు వచ్చాయి. భూ ఉపరితలానికి 40 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటో ఆవరణలో ఉండే ఈ పొర.. భూమికి సన్‌స్క్రీన్‌లా వ్యవహరిస్తూ జీవులను హానికారక అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ ఇస్తోంది. సాధారణ వాతావరణ పరిస్థితులున్నప్పుడు సెప్టెంబర్‌ చివర్లో లేదా అక్టోబర్‌ ప్రారంభంలో ఈ రంధ్రం గరిష్ఠంగా 20 మిలియన్‌ చదరపు కి.మీ మేర ఉంటుంది. ఇప్పుడు 10 మిలియన్‌ చదరపు కి.మీలకు తగ్గినట్టు గుర్తించారు.

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.