close
మధుమేహ రెటినోపతిపై దృష్టి

 రాష్ట్రంలో తొలి దశలో 10 పరీక్ష కేంద్రాలు 

 బస్తీ దవాఖానాల్లోనూ అందుబాటులోకి 

 ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే  అంధత్వ నివారణకు అవకాశాలు

రక్తంలో చక్కెర స్థాయి అదుపులో లేకపోతే.. కంటిలోని అతిచిన్న రక్తనాళాలు ఉబ్బి, పగిలిపోతాయి. ఫలితంగా రెటీనాపై రక్తపు మరకలు ఏర్పడటం.. అంతర్గత స్రావం కావడం వంటివి ఎదురవుతాయి. తొలుత ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా.. తీవ్రత మధ్య దశలో ఉన్నప్పుడు కళ్లు మసకబారడం, చూపులో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలతో క్రమేణా చూపు కోల్పోయే ప్రమాదముంది. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘డయాబెటిక్‌ రెటినోపతి’ అంటారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించి సరైన చికిత్స అందించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్రంలో తొలి దశలో 10 కేంద్రాల్లో మధుమేహ రెటినోపతి వ్యాధి నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మలి దశలో రంగారెడ్డి జిల్లాలో 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, తర్వాత దశలవారీగా అన్ని జిల్లాల్లో ఈ పరీక్ష కేంద్రాలను నెలకొల్పాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది.

బస్తీ దవాఖానాలు (హైదరాబాద్‌ మహానగర పరిధిలో)

* చింతబావి (మెట్టుగుట్ట)
* నరసింహబస్తీ (తిలక్‌నగర్‌)
* గంగానగర్‌ (హర్రాజీపేట)
* ముత్యాలమ్మబాగ్‌ (గగన్‌మహల్‌)
* అల్లాద్దిన్‌కోఠి (అమీర్‌పేట)
* మధుమేహ రెటినోపతిని నిర్ధరించే ‘ఫండస్‌ కెమెరా’ పరికరాలను ఉమ్మడి జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ప్రభుత్వ నిధులతో, హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానాల్లో పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటుచేశారు. రాష్ట్ర అంధత్వ నివారణ కార్యక్రమ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ మోతీలాల్‌నాయక్‌  హైదరాబాద్‌ చింతబావి దవాఖానాలో గురువారం ఈ పరీక్షలను ప్రారంభించారు.

పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన జిల్లా కేంద్ర ఆసుపత్రులు

* మహబూబ్‌నగర్‌
* వరంగల్‌
* నల్గొండ
* ఆదిలాబాద్‌
* సంగారెడ్డి

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.