
సింగపూర్: వృద్ధాప్య ఛాయలు రావడానికి అసలు కారణమేంటో సింగపూర్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పేగుల్లోని సూక్ష్మజీవుల కారణంగానే ముదిమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని గుర్తించారు. వీటిని నియంత్రించడం ద్వారా, వృద్ధాప్య ప్రక్రియను జాప్యం చేయవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనిషి పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు... జీవక్రియలు, పోషకాహారం, మనస్తత్వం, ప్రవర్తనలో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్న విషయమై నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ప్రొఫెసర్ పెటెర్సన్ బృందం ఎలుకలపై ప్రయోగాలు చేసింది. ‘‘ఈ సూక్ష్మజీవులు బ్యుటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. ఇది దీర్ఘాయువుకు కారణమయ్యే ఎఫ్‌జీఎఫ్21 అనే హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. దేహశక్తి వినియోగాన్ని, జీవక్రియల తీరును గాడిలో పెట్టడం ద్వారా ఈ హార్మోన్ వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది. వయసు పెరిగేకొద్దీ బ్యుటిరేట్ ఉత్పత్తి తగ్గి, శరీరం దుర్బలమవుతుంది. ఆహారం ద్వారా బ్యుటిరేట్ స్థాయుల్ని పెంచుకోగలిగితే... వృద్ధాప్య ప్రక్రియను జాప్యం చేసుకోవచ్చు’’ అని పెటర్సన్ వివరించారు.
కథనాలు
దేవతార్చన

- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!