
2044 నుంచి ఏటా కొంతకాలం ఐస్ అదృశ్యం
వాతావరణ మార్పులే కారణం
లాస్ ఏంజిలెస్: మానవ చర్యలతో తలెత్తుతున్న వాతావరణ మార్పుల వల్ల ఆర్కిటిక్ మహాసాగరంలో ఏటా కొంతకాలం పాటు మంచు జాడే కనపడదని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం హెచ్చరించింది. ఆర్కిటిక్ వృత్తంలో భారీగా సాగర మంచు ఫలకం ఉంది. ఇది చాలా కీలకం. ఎందుకంటే అది సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందించి, భూమిపై వేడిని తగ్గిస్తుంది. ఏటా సెప్టెంబర్లో ఈ ఐసు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత తిరిగి విస్తరిస్తుంది. ఆర్కిటిక్ సాగర మంచు భవిత ఎలా ఉంటుందోనని నిర్ధరించేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో 1979 నుంచి సాగించిన ఉపగ్రహ పరిశీలనలను కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. సెప్టెంబర్లో ఐసు పరిమాణం తగ్గుదల విషయానికి వస్తే అది దశాబ్దానికి 13 శాతం చొప్పున క్షీణిస్తున్నట్లు తేలింది. ఈ లెక్కన 2044 నుంచి 2067 మధ్యకాలంలో ఏటా సెప్టెంబర్లో మంచు జాడలేని పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థికంగా, పర్యావరణపరంగా నష్టాలు పెరుగుతాయని చెప్పారు.
కథనాలు
దేవతార్చన

- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..