close
మెదడులో ఆ మార్పులతోనే ఆత్మహత్య ఆలోచనలు!

లండన్‌: దాదాపు 8 లక్షలు.. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆత్మహత్య చేసుకుంటున్నవారి సంఖ్య ఇది. ప్రతి 40 సెకన్లకు ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మనుషుల్లో ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలకు అడ్డుకట్ట వేయడంలో ఉపయోగపడే కీలక అంశాలను గుర్తించింది బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం. మెదడుపై విశ్లేషణలకు సంబంధించిన 131 అధ్యయనాలను ఈ బృందం పరిశీలించింది. మెదడు నిర్మాణం, పనితీరులో ఎలాంటి మార్పులు వస్తే బలవన్మరణ ముప్పు పెరుగుతోందో విశ్లేషించింది. మెదడులో మిడియల్‌, లాటరల్‌ వెంట్రల్‌ ప్రిఫ్రంటల్‌ కార్టెక్స్‌ను ఇతర భాగాలతో అనుసంధానించే నెట్‌వర్క్‌ భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆ నెట్‌వర్క్‌లో మార్పులు వస్తే ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నట్లు గుర్తించారు. డార్సల్‌ ప్రిఫ్రంటల్‌ కార్టెక్స్‌, ఇన్ఫీరియర్‌ ఫ్రంటల్‌ గైరస్‌ సిస్టమ్‌గా పిలిచే మరో నెట్‌వర్క్‌లో తలెత్తే మార్పులు కూడా బలవన్మరణ ఆలోచనలను రేకెత్తిస్తున్నట్లు తేల్చారు. ఆ భాగాల్లో మార్పులు రాకుండా దృష్టిపెట్టడం ద్వారా వ్యక్తుల్లో ఆత్మహత్యలను తగ్గించవచ్చునని పేర్కొన్నారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.