close

ప్రధానాంశాలు

వేడి దెబ్బకు తగ్గుతున్న పక్షి కాయం!

వాషింగ్టన్‌: పర్యావరణ మార్పులు పక్షుల శరీర పరిమాణంపై ప్రభావం చూపుతున్నాయని తాజా అధ్యయనమొకటి గుర్తించింది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వాటి కాయం కుంచించుకుపోతోందని వెల్లడించింది. అదే సమయంలో రెక్కల వెడల్పు మాత్రం పెరుగుతున్నట్లు తెలిపింది. 1978-2016 మధ్య షికాగోలో భవనాలను ఢీకొట్టి మృత్యువాతపడ్డ 70 వేల వలస పక్షులపై మిషిగన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో 52 జాతుల విహంగాలున్నాయి. పర్యావరణ వేడి పెరుగుదలతో క్రమంగా అన్ని పక్షుల్లో శరీర పరిమాణం తగ్గుతున్నట్లు పరిశోధకులు తేల్చారు. 49 జాతుల్లో ఆ తగ్గుదల గణనీయంగా ఉందని పేర్కొన్నారు. 40 జాతుల విహంగాల్లో రెక్కల వెడల్పు అధికమవడాన్ని గుర్తించినట్లు చెప్పారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.