close

ప్రధానాంశాలు

ఓటీపీ కోసం 60 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి.

మూడేళ్ల వ్యవధిలో ఐదు సార్లు అమెరికా వెళ్లివచ్చాను. వచ్చే నెలలో వీసా కాలం తీరనుంది. డ్రాప్‌ బాక్స్‌ ద్వారా వీసాను ఇప్పుడు పునరుద్ధరించుకోవచ్చా?

- రాధికా కృష్ణ

 

వీసాను ఎప్పుడైనా పునరుద్ధరించుకోవచ్చు. గడువు తీరకముందూ చేసుకోవచ్చు. కాలం తీరడానికి ఆరు నెలల ముందుగానే పునరుద్ధరణ చేసుకోవాలన్నది మా సూచన. ముందుగా దరఖాస్తు చేసుకోవటం ద్వారా ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హత పొందవచ్చు. మరింత సమాచారం కోసం ‌www.ustraveldocs.com/in చూడండి.

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మా ఇద్దరి వీసాలు కాలం తీరనున్నాయి. జనవరిలో ఆరు నెలల పర్యటన కోసం అమెరికా వెళ్లవచ్చా?

- ప్రద్మనాభ్‌

 

వీసాలు చెల్లుబాటులో ఉన్నంత కాలంలో మీరు ప్రయాణం చేయవచ్చు. అమెరికా ప్రవేశప్రాంతంలోని పోర్టు వరకు వెళ్లేందుకు మాత్రమే మీ వీసా అనుమతిస్తుంది. అమెరికాలోకి మిమ్మల్ని అనుమతించాలా? లేదా? అక్కడ ఎంత కాలం ఉండవచ్చు అన్నది అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు నిర్ణయిస్తారు. అమెరికాకు వచ్చే నాటికి వీసా చెల్లుబాటు కాలం ఎప్పటి వరకు ఉందో అంత కాలం ఉండేందుకు అనుమతించవచ్చు.

మాస్టర్స్‌ డిగ్రీ ఈ ఏడాదితో పూర్తవుతుంది. ఓటీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? ఓటీపీ కాలంలో సెలవులకు భారతదేశం వెళ్లవచ్చా?

- శివనాథ్‌ మంత

 

కోర్సు పూర్తి కావటానికి 60 రోజుల ముందుగా ఓటీపీ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ గడువు పరిధిలో ఉంటే ఓటీపీ దరఖాస్తును సిద్ధం చేసుకోండి. ఎఫ్‌-1 వీసాపై ఉన్న చెల్లుబాటయ్యే ఓటీపీ స్థితి ఉంటే అమెరికా వెలుపలి దేశాల్లో పర్యటించవచ్చు. వీసా కోసం, అమెరికా ప్రవేశ ప్రాంతం వరకు వచ్చేందుకు అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయా? లేదా? అన్న అంశాన్ని నిర్ధారించుకునేందుకు మీ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ వ్యవహారాల అధికారితో మాట్లాడండి.

ఈ ఏడాదితో నా హెచ్‌-1బీ వీసా పిటిషన్‌ కాలం తీరనుంది. వీసాను పునరుద్ధరించుకునే పనిలో ఉన్నాను. మా అత్తమామలు పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చా?

- రాజారాం కన్నెగంటి


 

అమెరికా వచ్చేందుకు మీ అత్తమామలు ఎప్పుడైనా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పర్యాటక వీసా అయిన బీ1/బీ2 కోసం దరఖాస్తు చేసుకోవాలి. పర్యాటక వీసాపై అమెరికా వచ్చే వారిని ఆరు నెలలు అంతకన్నా తక్కువ కాలం ఉండేందుకు మాత్రమే ప్రవేశ ప్రాంతంలో అనుమతిస్తారు.
* వీసాలకు సంబంధించిన నిర్దిష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.comకు ఈ-మెయిల్‌ చేేయండి.
* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.govను సంప్రదించవచ్చు.
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net  కు పంపగలరు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.