
ప్రధానాంశాలు
కంభం, పోరుమామిళ్ల చెరువులకూ చోటు
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కేసీ కాలువ,కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువులకు ప్రపంచ చారిత్రక నీటి పారుదల కట్టడాల(వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్) గుర్తింపు లభించింది. 2020 సంవత్సరానికిగానూ ప్రపంచంలోని 14 సాగునీటి ప్రాజెక్టులకు స్థానం లభించగా, ఇందులో భారతదేశంలో నాలుగింటికి అవకాశం లభించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి మూడు ఉండగా.. మహారాష్ట్రలోని ధామాపూర్ చెరువు మరొకటి. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రెయినేజీ సంస్థ (ఐ.సి.ఐ.డి) న్యాయనిర్ణేతల బృందం అంతర్జాతీయంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించి ఎంపిక చేసింది.
* ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు చారిత్రక ప్రసిద్ధి చెందినది. గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ చెరువు ఆసియాలోనే రెండో అతి పెద్ద సాగునీటి చెరువు. 500 ఏళ్లక్రితం నిర్మించిన ఈ చెరువు కింద 10,300 ఎకరాల ఆయకట్టు ఉంది.
* కడప జిల్లా పోరుమామిళ్లలోని చెరువుకూ 500 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. 1903లో బయటపడిన శాసనం ద్వారా ఈ చెరువు చరిత్ర వెలుగు చూసింది. ఈ చెరువు కింద 3,864 ఎకరాల ఆయకట్టు ఉంది.
* కర్నూలు-కడప (కేసీ) కాలువను బ్రిటిషు హయాంలో 1863-70 సంవత్సరాల మధ్య రవాణా, సాగునీటి అవసరాల కోసం తవ్వారు. తుంగభద్రపై కర్నూలు జిల్లాలో నిర్మించిన సుంకేశుల బ్యారేజి నుంచి కడప జిల్లా కృష్ణరాజపురం వరకు ఈ కాలువను నిర్మించారు. సర్ ఆర్థర్ కాటన్ సూచన మేరకు రవాణా తగ్గించడంతో సాగునీటి ప్రాజెక్టుగా మారింది. తుంగభద్ర-పెన్నా నదులను కలిపేలా 305.60 కి.మీ. దూరం ఈ కాలువ ఉంది. కర్నూలు, కడప జిల్లాల్లో 39 టీఎంసీల నీటి వినియోగంతో 2.88 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- అమిత్ షాతో కీలక అంశాలు చర్చించిన జగన్
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- వీరే ‘గబ్బా’ర్ సింగ్‌లు..!
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- రహానె వ్యూహం.. కుర్రాళ్ల పోరాటం... అద్భుతం
- ‘కేరింత’ హీరోపై కేసు నమోదు
- కరోనా భయంతో.. అలా చేశాడట..!
- మాటల్లో చెప్పలేను: రహానె
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది