
ప్రధానాంశాలు
ఏసీబీకి చిక్కిన నిందితుల్లో వీరే అధికం
ఈనాడు, హైదరాబాద్: శాఖాపరమైన అవినీతిలో గత ఏడాది కూడా రెవెన్యూ శాఖే అగ్రస్థానంలో నిలిచింది. 2020లో అవినీతి నిరోధక శాఖలో మొత్తం 83 కేసులు నమోదు కాగా వాటిలో 21 కేసులు రెవెన్యూ శాఖవే ఉన్నాయి. గత ఏడాది ఆర్డీవో, అదనపు కలెక్టర్ ఏసీబీ వలకు చిక్కడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ 112 ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రాల కోసం ఏకంగా రూ. 1.12 కోట్లు డిమాండ్ చేశారు. బాధితుడితో స్వయంగా ఫోన్లో బేరసారాలు జరిపి ఏసీబీకి దొరికిపోయారు. ఇదే కేసులో ఓ ఆర్డీవో సైతం ఇరుక్కున్నారు. అంతకుముందు కీసర తహసీల్దారు నాగరాజు ఏకంగా రూ. 1.1 కోట్ల లంచం సొమ్ము తీసుకుంటూ చిక్కారు. గతంలో రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దారు ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో ఏకంగా రూ. 93.5 లక్షల నగదు లభ్యమవడం తెలిసిందే. అలాగే షేక్‌పేట తహసీల్దారు సుజాత ఇంట్లో రూ. 30 లక్షల సొత్తు దొరికింది.
అయిదేళ్లలో 123 కేసులు
లంచాలకు సంబంధించి అవినీతి నిరోధకశాఖ వద్ద గత అయిదేళ్లలోనూ రెవెన్యూ శాఖపైనే 123 కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో నాలుగొంతుల మంది లంచాలు తీసుకొంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కినవారే కావడం గమనార్హం.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- ఇక చాలు
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..