ఊపిరితిత్తులకు పొగ!
close

ప్రధానాంశాలు

ఊపిరితిత్తులకు పొగ!

క్షయ బాధితుల్లో 89 శాతంమంది పొగాకు వాడుతున్నవారే

ఈనాడు, హైదరాబాద్‌: ఊపిరితిత్తులను పొగ చుట్టుముడుతోంది. క్షయ బారినపడినవారిలో అత్యధిక శాతంమంది ఏదో ఒక రూపంలో పొగాకు ఉత్పత్తులను వాడుతున్నవారేనని తేలింది. గత నాలుగేళ్ల లెక్కలను పరిశీలిస్తే.. ఏటేటా క్షయ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేసుల నిర్ధారణలో లక్ష్యాన్ని అధిగమించడం వల్లనే ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో 2017లో 48,444 కేసులు నమోదు కాగా.. 2018లో 52,191 కేసులు, 2019లో ఏకంగా 70,202 మంది రోగులను గుర్తించారు. 2020లో 62,342 మంది టీబీ బారిన పడినట్లు తేలింది. 2019లో కొత్త టీబీ కేసుల నిర్ధారణ విషయంలో దేశం మొత్తమ్మీద తెలంగాణ మొదటి స్థానంలో నిలిచి, కేంద్ర ఆరోగ్యశాఖ ప్రశంసలను పొందింది. క్షయ నిర్మూలనపై  ఆరోగ్యశాఖ ఒక నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని