
ప్రధానాంశాలు
గదుల్లో వైరస్, బ్యాక్టీరియాను యూవీ-సీ కిరణాలు, గాలి ద్వారా శుద్ధిచేసే ‘జర్మిబన్’ పరికరాన్ని హైదరాబాద్కు చెందిన నియో ఇన్వెంట్రానిక్స్ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసింది. ఇవి కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగపడతాయి. ఈ సంస్థ వ్యవస్థాపకులు జి.ఎస్.చక్రవర్తి, శిరీషలు సామాజిక బాధ్యతగా ఇటీవల రెండు జర్మిబన్ పరికరాలను చెస్ట్ ఆసుపత్రికి అందజేశారు. సీసీఎంబీ ధ్రువీకరించిన ఈ పరికరం స్టార్టప్ ఇండియాకు ఎంపికైందని, నీతి ఆయోగ్ ప్రశంసలు పొందిందని శిరీష తెలిపారు. యూవీ-సీ కిరణాలతో గదుల్లో బ్యాక్టీరియాను శుద్ధి చేసే పరికరాలు ఇప్పటికే మార్కెట్లో అనేకం ఉన్నా.. ఈ పరికరంలో యూవీ-సీతో పాటు అయొనైజేషన్, ఓజోనైజేషన్, హెపా ఫిల్టర్ కలిసి ఉండటం ప్రత్యేకమని తెలిపారు. ఒకే పరికరం నాలుగు రకాలుగా పనిచేస్తుందని వెల్లడించారు.
- ఈనాడు, హైదరాబాద్
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- దిగ్గజ పథంలో..