
ప్రధానాంశాలు
శిథిలావస్థలో ఉన్న ఈ నిర్మాణం.. వందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న జైన మందిరం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్పల్లిలోని ఈ మందిరం స్థానికంగా గొల్లత్త గుడిగా ప్రసిద్ధికెక్కింది. దీని పూర్తి ఎత్తు 65 అడుగులు. దేశంలో ఇటుకలతో నిర్మించిన ఎత్తైన జైన దేవాలయాలలో ఇది ఒకటి. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం.. జైన మత కేంద్రంగా వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ పురాతన ఆలయాన్ని రాష్ట్ర పురావస్తుశాఖ తన ఆధీనంలోకి తీసుకుని చుట్టూ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ నిర్మించి చేతులు దులుపుకొంది. ఆవరణ మొత్తం ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. పర్యవేక్షణ లేకపోవడంతో.. కొందరు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. వర్షాలకు ఇటుకలు దెబ్బతింటున్నాయి. ఆలయాన్ని పరిరక్షించాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పురావస్తు ప్రేమికులు కోరుతున్నారు.
- ఈనాడు, మహబూబ్నగర్
ప్రధానాంశాలు
దేవతార్చన

- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- దిగ్గజ పథంలో..