రేషన్‌ బియ్యం కోసం ఎదురుచూపులు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేషన్‌ బియ్యం కోసం ఎదురుచూపులు

 తెరుచుకున్నవి 2 వేల దుకాణాలే

ఈనాడు, హైదరాబాద్‌ - ఖమ్మం కలెక్టరేట్‌ (న్యూస్‌టుడే): కరోనా కష్ట కాలంలో పేదలు రేషన్‌ బియ్యం కోసం ఎదురుచూస్తున్నారు. చౌకధరల దుకాణాలు తెరుచుకోకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు దుకాణాలు తెరిచేది లేదని డీలర్లు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 17,021 దుకాణాలు ఉంటే బుధ, గురువారాల్లో రెండు వేలు తెరుచుకున్నాయి. మామూలుగా అయితే ప్రతీ నెల ఒకటి నుంచి 15 వరకు బియ్యం ఇవ్వాలి. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో తమను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించటంతోపాటు ఓటీపీ, ఐరిస్‌ విధానాల స్థానంలో థర్డుపార్టీ అథెంటికేషన్‌ కావాలని డీలర్లు కోరుతున్నారు. రాష్ట్రంలో 1.78 లక్షల మెట్రిక్‌ టన్నులకుగాను ఇప్పటి వరకు కేవలం 3,715 ఎంటీల బియ్యమే పంపిణీ చేశారు. అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవటంతో రేషన్‌కార్డుదారులు ఇబ్బందులుపడే పరిస్థితి వచ్చింది.
గడువు పొడిగిస్తారా?
ఇప్పటి వరకు కేవలం రెండు శాతం బియ్యమే పంపిణీ చేశారు. మిగిలిన తొమ్మిది రోజుల్లో నూరు శాతం పూర్తి చేయటం సాధ్యం కాదు. గడువు పొడిగించాల్సి ఉంటుంది. కరోనా తొలిదశలో బియ్యం పంపిణీలో జాప్యంతో గడువు పొడిగించారు. ప్రస్తుతం రేషన్‌కార్డులోని ప్రతి వ్యక్తికి పది కిలోలు ఇవ్వాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అయిదు కిలోలు, కేంద్రం అదనంగా ఇస్తున్న అయిదు కిలోలు ఉన్నాయి.
దరఖాస్తుదారులకు బియ్యం ఎప్పుడు?
రాష్ట్రంలోని సుమారు ఆరేడు లక్షల కుటుంబాలు రేషన్‌కార్డుల కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నాయి. వారికి కార్డులు ఇవ్వకపోవటంతో బియ్యం అందని పరిస్థితి. దరఖాస్తుదారుల్లో అర్హులకు రేషన్‌కార్డులు అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ప్రకటించారు. శాఖా పరంగా ఇప్పటి వరకు ఎలాంటి కదలికా లేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు