హే గాంధీ.. ఊపిరి ఆడడంలేదు..
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హే గాంధీ.. ఊపిరి ఆడడంలేదు..

ఫ్యాన్లు తిరగడంలేదు.. 

కొవిడ్‌ వైద్య సేవల్లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో పలుచోట్ల ఫ్యాన్లు చెడిపోయి తిరగకపోవడంతో.. ఉక్కపోతతో అల్లాడిపోతున్నామని రోగులు వాపోతున్నారు. కరోనాతో అసలే ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న బాధితులను ఇది మరింత వేధిస్తోంది. సిబ్బందికి చెప్పినా పట్టించుకోకపోతుండడంతో ఫోన్లలో కుటుంబసభ్యులకు చెప్పి టేబుల్‌ ఫ్యాన్లు తెప్పించుకుంటున్నారు. వారి బంధువులు ఫ్యాన్లు కొనుగోలు చేసి ఆసుపత్రి వద్దకు వచ్చినా.. లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించకపోవడంతో కొందరు వెనుదిరిగారు. కొందరు ఆసుపత్రి సిబ్బంది ద్వారా సిఫార్సు చేయించుకుని లోపలికి ఫ్యాన్‌ని తీసుకెళ్లారు. శనివారం ఆసుపత్రి ముందు కనిపించిన దృశ్యమిది..


- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు