నాలుగు అడుగులు వేయలేని స్థితి.. సాయం అందని దుస్థితి!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగు అడుగులు వేయలేని స్థితి.. సాయం అందని దుస్థితి!

కరోనా లక్షణాలతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తిని ఆయన భార్య బుధవారం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో సిబ్బంది పీపీఈ కిట్‌ ఇచ్చి.. దానిని ధరించి కొవిడ్‌ వార్డుకు వెళ్లాలని సూచించారు. అప్పటికే ఆయన ఆయాసంతో ఉన్నారు. అడుగులు వేసేందుకు ఓపిక లేకున్నా.. అక్కడ మూడు చక్రాల కుర్చీ కానీ, స్ట్రెచర్‌ కానీ అందుబాటులో లేకపోవడంతో భార్య చేయి పట్టుకొని మెల్లగా నడవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా నేలపై పడిపోయారు. ఆయనను లేపేందుకు భార్య ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అక్కడ చాలామందే ఉన్నా కరోనా భయంతో చేయూత ఇచ్చేందుకు మందుకు రాలేదు. ఆ వెంటనే ఆయన భార్య.. ఆస్పత్రిలోకి పరుగెత్తి వైద్యసిబ్బందిని బతిమిలాడగా.. 15 నిమిషాల తర్వాత మూడు చక్రాల కుర్చీలో ఆయనను కొవిడ్‌ వార్డుకు తరలించారు. 

   - న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు