వైరస్‌ను జయించిన శతాధిక వృద్ధుడు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరస్‌ను జయించిన శతాధిక వృద్ధుడు

  మరో 90 ఏళ్ల వృద్ధురాలూ..
  వెల్లడించిన గాంధీ ఆసుపత్రి  సూపరింటెండెంట్‌ రాజారావు

ఓ శతాధిక వృద్ధుడు కొవిడ్‌ మహమ్మారిని జయించారు. హైదరాబాద్‌కు చెందిన రామానందతీర్థులు అనే వృద్ధుడు 18 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆయన వైరస్‌ నుంచి బయటపడ్డారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు బుధవారం వెల్లడించారు. తన వయస్సు 110 ఏళ్లని తెలిపారని.. అంత వయస్సున్న వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడం దేశంలో ఇదే ప్రథమమని రాజారావు పేర్కొన్నారు. ‘‘కీసరగుట్ట ప్రాంతంలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న రామానందతీర్థ(110)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఉంటున్న కీసరగుట్ట ప్రాంతంలోని ఆశ్రమం వారు గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ, ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగయ్యేవరకు ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతాం. ఆపై డిశ్ఛార్జి చేస్తాం’’ అని రాజారావు వివరించారు. రామానందతీర్థులుకు భార్యాపిల్లలు ఎవరూ లేరు. గతంలో ప్రవచనకర్తగా పనిచేశారు.
హైదరాబాద్‌ ముషీరాబాద్‌కు చెందిన పెంటమ్మ(90) అనే వృద్ధురాలూ కరోనాను జయించారని రాజారావు తెలిపారు. ఆమె గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 7న చేరారని.. నెగెటివ్‌ రావడంతో బుధవారం డిశ్ఛార్జి చేశామని ఆయన పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి

104 ఏళ్ల ‘యోధుడు’

బెంగళూరు(ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే: శతాధిక వృద్ధుడు, స్వాతంత్య్ర సమర యోధుడు హెచ్‌.ఎస్‌.దొరెస్వామి కరోనాను జయించారు. కొన్ని రోజుల కిందట కరోనా సోకడంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 104ఏళ్ల వయసులోనూ చికిత్స సమయంలో ఆత్మస్థైర్యంతో ఉన్నారని, అందుకే ఔషధాలూ చాలా బాగా పని చేశాయని వైద్యులు తెలిపారు. బుధవారం పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో భయాలేవి పెట్టుకోకుండా పుస్తక పఠనంతో చేశానని దొరెస్వామి తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు