వెలుగులు పంచే కుటుంబాల్లో చీకట్లు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెలుగులు పంచే కుటుంబాల్లో చీకట్లు

 విద్యుత్‌ ఉద్యోగుల్లో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు
  టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 33 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: నిత్యం ప్రజలకు వెలుగులు పంచే విద్యుత్‌ ఉద్యోగుల జీవితాల్లో కొవిడ్‌ మహమ్మారి చీకట్లు కమ్ముతోంది. రెండో ఉద్ధృతిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు వదలగా.. రోజూ పదుల సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. సహచరులు రోజుకు ఒకరిద్దరు చనిపోతుండటంతో మిగిలిన ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌/డిస్కం) పరిధిలో నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు ఉద్యోగులు 24 గంటలపాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. కొవిడ్‌ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు ఉన్న ప్రాంతాల్లో సమస్యలు లేకుండా.. ఒకవేళ ఏర్పడినా తక్షణం పరిష్కరించేందుకు కాల్‌ సెంటర్ల ద్వారా అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఆర్టిసన్‌, జూనియర్‌ లైన్‌మెన్‌, లైన్‌మెన్‌, సబ్‌ఇంజినీర్లతోపాటు ఏడీఈ, డీఈ వరకు కొవిడ్‌ బారిన పడ్డారు.
2000 మంది బాధితులు
ఉద్యోగులు, పింఛనుదారులు, ఆర్టిసన్‌లలో 2000 మందికిపైగా కొవిడ్‌ బారిన పడ్డారు. 33 మంది చనిపోయారు. వెయ్యి మందికిపైగా కోలుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 900 మంది ప్రస్తుతం ఇళ్లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని తొమ్మిదింట ఆరు సర్కిళ్లలో ఒక్కో దాంట్లో వంద మందికిపైగా కొవిడ్‌ బారిన పడ్డారు. నల్గొండలో 100 మంది, సంగారెడ్డిలో 140 మంది బాధితులయ్యారు. కొవిడ్‌ భయంతో కార్పొరేట్‌ కార్యాలయంలో హాజరు శాతం పది శాతానికి పడిపోయింది. ట్రాన్స్‌కో, జెన్‌కోలు అన్ని విభాగాల్లో కలిపితే కేసుల సంఖ్య రెండు రెట్లకు పైగా ఉంటుందని, ఇప్పటివరకు 100 మంది వరకు కొవిడ్‌తో చనిపోయారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.
24 గంటల కాల్‌ సెంటర్‌ సేవలు
ఉద్యోగులకు సత్వర చికిత్స, ఆసుపత్రి సదుపాయాల సమాచారం అందించేందుకు డిస్కం ప్రధాన కార్యాలయంలో డివిజినల్‌ ఇంజినీర్‌ నేతృత్వంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటూ వైద్య అత్యవసర పరిస్థితుల్లో తోడ్పాటు అందిస్తోంది. విద్యుత్‌ ఉద్యోగుల్లో చాలామందికి ఇప్పటివరకూ టీకాలు అందలేదు. ఈ నేపథ్యంలో తమనూ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తించి టీకా పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు