రైతు ధాన్య రక్షణ వేదిక
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతు ధాన్య రక్షణ వేదిక

రైతులంతా ఓ చోట సమావేశమై వారి సమస్యలను చర్చించుకుని పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో రైతువేదికలు ఏర్పాటు చేసింది. ఈ భవనాలు వర్షాల నుంచి ధాన్యం బస్తాలను తడవకుండా కాపాడుకోవడానికి సైతం ఉపయోగపడుతున్నాయి. దీనికి నిదర్శనం రంగారెడ్డి జిల్లా మంచాలలోని రైతు వేదిక భవనం. ఇటీవల భారీ వర్షానికి రాష్ట్రంలోని చాలా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిశాయి. కొన్ని చోట్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. మంచాలలోని రైతు వేదిక భవనంలో ఉంచిన ధాన్యం మాత్రం భద్రంగా ఉంది. భవనానికి దగ్గరలోనే కొనుగోలు కేంద్రం ఉండడంతో మిల్లులకు తరలించగా మిగిలిన బస్తాలను ఇందులో నిల్వ ఉంచారు. 

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు