ఔరా మూసీ..!
close

ప్రధానాంశాలు

ఔరా మూసీ..!

మూసీ నది పేరు వినగానే అసంకల్పితంగా ముక్కులు మూసుకునే పరిస్థితి ఒకప్పుడు.. కానీ నేడు దాన్ని చూస్తే ఔరా.. మూసీ అనాల్సిందే. మూసీ నదీపరీవాహక అభివృద్ధి సంస్థ(ఎంఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో నదీ పరీవాహకం, ఒడ్డును సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే ఆరునెలల కిందట హైదరాబాద్‌లోని నాగోల్‌ బ్రిడ్జి వద్ద ఉద్యానవనం పనులు ప్రారంభించారు. నదికి రెండు వైపులా పాదబాటలు, వాటిపై రంగురంగుల పూల మొక్కలతో తీర్చిదిద్దారు. నది మధ్యలో పర్ణశాలను తలపించేలా నిర్మాణాలు చేపట్టారు. నదిలో కింద నుంచి వెళ్తున్న పైప్‌లైన్‌ మ్యాన్‌హోల్‌ దిమ్మలకు రంగులు వేసి హైదరాబాద్‌ చరిత్రను గుర్తుకు తెచ్చేలా చిత్రాలు రూపొందించారు. త్వరలోనే మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ పార్క్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని