పనసకాయ పౌడర్‌తో మధుమేహానికి చెక్‌
close

ప్రధానాంశాలు

పనసకాయ పౌడర్‌తో మధుమేహానికి చెక్‌

శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి వైద్యుడి అధ్యయనం

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పనసకాయలో మధుమేహాన్ని అదుపుచేసే గుణాలు ఉన్నాయని శ్రీకాకుళం సర్వజనాసుపత్రి వైద్యులు గుర్తించారు. దీనికి సంబంధించి ఆసుపత్రి మెడిసిన్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసరుగా పని చేస్తున్న ఎ.గోపాలరావు బృందం చేసిన పరిశోధనలపై అంతర్జాతీయ జర్నల్‌లో వ్యాసం ప్రచురితమైంది. పనసకాయలో మధుమేహాన్ని అదుపు చేసే ఫైబర్‌, మినరల్స్‌, యాంటీ డయాబెటిస్‌ పదార్థాలు ఉంటాయని ఈ సందర్భంగా గోపాలరావు వెల్లడించారు. ఈ కాయతో లభించే పదార్థాలతో పుణెలోని ఓ కంపెనీ పౌడర్‌ తయారు చేస్తోందని తెలిపారు. ‘దీనిలో మధుమేహ వ్యాధిగ్రస్థులకు ప్రయోజనం ఉంటుందేమోనని ప్రయోగాలు చేశాం. ముఖ్యంగా టైప్‌2 మధుమేహ వ్యాధి పీడితుల్లో ప్లాస్మా గ్లూకోజ్‌ స్థాయి తగ్గించడంతో ఇది ప్రభావవంతంగా పని చేస్తుందని గుర్తించాం. మే 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు ఎంపిక చేసిన 18 నుంచి 60 ఏళ్ల వయసు వారిలో చక్కెర వ్యాధి అదుపులోకి వచ్చింది. ఇందులో ఆశించిన ఫలితాలు వచ్చాక ‘నేచర్‌’ జర్నల్‌కు పరిశోధనా పత్రాన్ని సమర్పించాం. మన ప్రాంతంలో అందుబాటులో ఉండే పనసకాయ పౌడర్‌ను ప్రతి రోజూ భోజనంలో ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే చక్కెర అదుపులోకి వస్తుంది. గత జనవరిలో జరిగిన స్టార్టప్‌ ఇండియా కాన్ఫరెన్స్‌లో కంపెనీ ప్రతినిధి జోసెఫ్‌ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ఈ పరిశోధనను తీసుకెళ్లారు’ అని గోపాలరావు వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని