ధాన్యం దింపడానికీ.. పడిగాపులే!
close

ప్రధానాంశాలు

ధాన్యం దింపడానికీ.. పడిగాపులే!

రాష్ట్రంలో ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో పండిన వరి ధాన్యాన్ని అమ్మడానికి ఇక్కట్లు తప్పడం లేదు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని దింపుకోవడానికి రైస్‌మిల్లుల యజమానులు కొర్రీలు పెడుతుండటంతో లారీలు రహదారుల వెంట రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఖరీదు చేస్తే..సూర్యాపేట జిల్లాలోని మిల్లుల్లో 6.5 లక్షల మెట్రిక్‌ టన్నులు దించారు. పొరుగున ఉన్న జనగామ జిల్లాలో సరిపడా రైస్‌మిల్లులు లేకపోవడంతో అధికారులు ఇక్కడి మిల్లులకు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. ఆ సరకును దిగుమతి చేసుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తుండటంతో సూర్యాపేట జిల్లా నాగారం వద్ద జాతీయ రహదారికి రెండు వైపులా 100కుపైగా లారీలు అయిదు రోజులుగా నిలిచిపోయాయి. బస్తాకు 2 కిలోల తరుగు ఇస్తేనే సరకు తీసుకుంటామని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని లారీల డ్రైవర్లు వాపోతున్నారు.

-ఈనాడు, సూర్యాపేట


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని