జూరాల మరమ్మతుకు రంగం సిద్ధం
close

ప్రధానాంశాలు

జూరాల మరమ్మతుకు రంగం సిద్ధం

రూ.11.38 కోట్లతో గేట్ల పటిష్ఠతకు టెండర్‌ ఖరారు
సమస్యను పలుమార్లు వెలుగులోకి తెచ్చిన ‘ఈనాడు’

ఈనాడు, హైదరాబాద్‌: జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు నీటిపారుదలశాఖ ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. గుత్తేదారుకు పనుల అప్పగింతకు ఆమోదం తెలిపింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ అధ్యక్షతన గురువారం కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీఓటీ) సమావేశం జరిగింది. జూరాలలో 62 గేట్ల పటిష్ఠత, పెయింటింగ్‌కు సంబంధించిన పనుల టెండర్‌ను ఖరారు చేసింది. ఈ పనికి రూ.12.43 కోట్లతో పరిపాలన అనుమతి ఇవ్వగా, రూ.11.38 కోట్లకు గుత్తేదారును ఖరారు చేశారు. స్వప్న ప్రాజెక్ట్‌ ఈ పనులను దక్కించుకున్నట్లు తెలిసింది. 2019 సెప్టెంబరులో ‘తుప్పు వదిలించకపోతే ముప్పు’ శీర్షికతో జూరాల గేట్ల సమస్యను ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ప్రభుత్వం ఇంజినీర్లతో రెండు కమిటీలు వేసింది. వారు ఇచ్చిన నివేదికల ప్రకారం మరమ్మతులకు అంచనాలు రూపొందించారు. ఈ ఏడాది మార్చి 30న రూ.12.43 కోట్లకు నీటిపారుదలశాఖ పరిపాలన అనుమతి ఇచ్చింది. అయినా వర్షాకాలం ప్రారంభంలోగా గుత్తేదారు ఖరారు, పనులు ప్రారంభం కాలేదు. ‘వరదవేళ పదిలమేనా?’ శీర్షికన ‘ఈనాడు’ గురువారం మరోమారు జూరాల సహా వివిధ ప్రాజెక్టుల్లో సమస్యలను వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలో ఎట్టకేలకు టెండరు ఖరారు చేశారు. మూసీ సహా పలు ప్రాజెక్టుల్లోనూ నిర్వహణ సమస్యలున్నాయి. వీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని