దూరమైన తోడూనీడ.. గోడపైనే జ్ఞాపకాల జాడ!
close

ప్రధానాంశాలు

దూరమైన తోడూనీడ.. గోడపైనే జ్ఞాపకాల జాడ!

చిత్రంలోని వృద్ధురాలి పేరు సుశీలమ్మ. తన భర్త రాములుతో కలిసి కష్టపడి పనులు చేస్తూ ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేసింది. వారిద్దరికీ పెళ్లిళ్లు చేసింది. కొడుకులు మాత్రం వారిని సరిగా చూసుకోలేదు. దీంతో భార్యాభర్తలు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి సమీపంలోని హోటళ్లలో పనులు చేస్తూ ఫుట్‌పాత్‌పైనే నివసించేవారు. ఈ క్రమంలో ఈ నెల 3న రాములు అనారోగ్యంతో మరణించాడు. నగరపాలక సంస్థ సిబ్బందే దహన సంస్కారాలు పూర్తిచేశారు. అప్పటి నుంచి భర్త పేరు, మరణించిన తేదీని అక్కడి ఓ మెట్రో పిల్లరు గోడపై రాసుకుని, భర్త జ్ఞాపకాలను తలుచుకుంటూ.. ఇలా ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని