పక్కాగా నీటి లెక్కలు
close

ప్రధానాంశాలు

పక్కాగా నీటి లెక్కలు

దిల్లీ: నీరు అపరిమితమైన ప్రకృతి వనరేమీ కాదు. విలువైన ఈ సంపదను దుర్వినియోగం చేయడం మంచిది కాదు. ఎక్కడ దీన్ని వృథా చేస్తున్నారు, ఎక్కడ అవసరం మేరకు వాడుకుంటున్నారన్న విషయాలను తెలుసుకొని, లెక్కించడం ఎలా?.. దీనిపై ఐఐటీ-గువాహటీకి చెందిన ప్రొఫెసర్‌ అనామికా బారువా ఆధ్వర్యంలో నిపుణులు పరిశోధన చేశారు. ‘వర్చువల్‌ వాటర్‌’ (వీడబ్ల్యూ) విశ్లేషణకు రూపకల్పన చేశారు. ప్రస్తుతానికయితే వ్యవసాయం, ఇతర రంగాల్లో ఎంత నీటిని ఉపయోగిస్తున్నారన్నదానిపై అంచనాలు మాత్రమే ఉన్నాయి. ఈ నూతన విధానం ద్వారా కచ్చితంగా ఎంత వినియోగించారన్నది తెలుస్తుంది. ఎంత అవసరం ఉంది? ఎంత వృథా చేశారన్నది స్పష్టంగా లెక్క కట్టి చెప్పడానికి వీలుపడుతుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పంటల సాగుకు ఇది ఉపకరిస్తుంది. నీటి లభ్యత ఆధారంగా ఏ పంటలు పండించాలన్నది నిర్ణయించుకోవచ్చు. శాస్త్రీయ పద్ధతులను, అధికారిక విధానాలను అనుసంధానం చేయడానికి ఇది ఉపకరిస్తుందని ప్రొఫెసర్‌ అనామిక తెలిపారు. ఈ పరిశోధనలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (హైదరాబాద్‌)కు చెందిన సుపరాన కాత్యాయని, యూనివర్సిటీ ఆఫ్‌ జరగోజా (స్పెయిన్‌)కు చెందిన రోసా డురాట్రే, ఐఐటీ-గువాహటికి చెందిన మిమికా ముఖర్జీ పాల్నొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని