కొవిడ్‌తో వచ్చే మధుమేహానికి మూలికా చికిత్స
close

ప్రధానాంశాలు

కొవిడ్‌తో వచ్చే మధుమేహానికి మూలికా చికిత్స

దిల్లీ: కరోనా నుంచి కోలుకున్నాక రక్తంలో అధిక చక్కెర స్థాయితో బాధపడుతున్నవారికి ఆయుర్వేద ఔషధాలతో ఉపశమనం లభించొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా బీజీఆర్‌-34 వంటి మందులతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు. కరోనాతో ఆసుపత్రిపాలైనవారిలో కనీసం 14.4 శాతం మందికి  మధుమేహం వస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యాధి నుంచి కోలుకున్నాక వీరి గ్లూకోజు జీవక్రియల్లో లోపాలు తలెత్తుతున్నాయని, అది హైపర్‌గ్లైసీమియాకు దారితీస్తోందని పేర్కొన్నారు. దీన్ని నియంత్రించడానికి అనేక ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ డైపెప్టైడల్‌-పెప్టిడేస్‌-4 (డీపీపీ-4) ఇన్హిబిటర్లు అత్యంత సురక్షితమైనవని తేలిందన్నారు. బీజీఆర్‌-34లో మణిపసుపు మొక్కకు సంబంధించిన సహజసిద్ధ బయోయాక్టివ్‌ పదార్థాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో డీపీపీ-4 ఇన్‌హిబిటర్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. జాతీయ వృక్ష పరిశోధన సంస్థ (ఎన్‌బీఆర్‌ఐ), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడిసినల్‌ అండ్‌ ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌ సంస్థలు ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని