కరోనాకు చెక్‌పెట్టే బ్యాక్టీరియా
close

ప్రధానాంశాలు

కరోనాకు చెక్‌పెట్టే బ్యాక్టీరియా

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను బ్యాక్టీరియాతో అంతమొందించే దిశగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. మనుషుల పేగుల్లో నివసించే ఒకరకం సూక్ష్మజీవులకు ఈ సామర్థ్యం ఉందని గుర్తించారు. ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలు కలిగిన కొవిడ్‌ బాధితులు కొందరిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు కూడా కనిపించినట్లు ఇప్పటికే వెల్లడైంది. మిగతావారిలో మాత్రం ఊపిరితిత్తులకే ఈ ఇన్‌ఫెక్షన్‌ పరిమితమైంది. ఈ నేపథ్యంలో పేగుల్లోకి వైరస్‌ చొరబడకుండా అక్కడి బ్యాక్టీరియా రక్షణ కల్పిస్తోందా అన్నది తాము తేల్చాలనుకున్నట్లు పరిశోధనలో పాలుపంచుకున్న మహ్మద్‌ అలీ చెప్పారు. ఇందులో భాగంగా.. సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే పదార్థాల్లో రోగాలతో పోరాడే సత్తా ఉన్న పదార్థాలతో కూడిన డేటాబేస్‌ను పరిశీలించామన్నారు. బిఫిడోబ్యాక్టీరియా అనే సూక్ష్మజీవికి కరోనా వైరస్‌తో పోరాడే సామర్థ్యం ఉందని తేల్చినట్లు చెప్పారు. ‘‘జీర్ణ వ్యవస్థలో వివిధ రకాల బ్యాక్టీరియా పరస్పరం పోటీపడుతుంటాయి. ఇందుకోసం పలు రకాల పదార్థాలను ఉపయోగించుకుంటాయి. వాటి ఆధారంగా ఇప్పటికే అనేక యాంటీబయోటిక్స్‌, క్యాన్సర్‌ చికిత్సలు రూపొందాయి. అందువల్లే ఈ అంశంపై దృష్టిసారించాం’’ అని మహ్మద్‌ అలీ చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని