ఒత్తిడికి ‘తెర’తీసిన మహమ్మారి!
close

ప్రధానాంశాలు

ఒత్తిడికి ‘తెర’తీసిన మహమ్మారి!

వాషింగ్టన్‌: కరోనా.. శారీరకంగానే కాక మానసికంగా, భావోద్వేగపరంగానూ ప్రజలను కుంగదీసిందని వెల్లడవుతోంది. విద్యార్థులపై ఈ మహమ్మారి సంబంధ ఒత్తిడి పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వినోదం కోసం వీరు ఎక్కువసేపు టీవీ, కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ వంటి ఉపకరణాల తెరలకు అతుక్కుపోవడాన్ని బట్టి ఇది స్పష్టమవుతోందని చెప్పారు. కరీబియన్‌ దేశమైన సెయింట్‌ విన్సెంట్‌లోని సెయింట్‌ జేమ్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 18-28 ఏళ్ల మధ్య వయసున్న పలువురు వాలంటీర్లపై సర్వే చేసినప్పుడు దాదాపు 70 శాతం మందిలో స్వల్పస్థాయి నుంచి తీవ్రస్థాయి కుంగుబాటు కనిపించిందని తేల్చారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మానసిక ఆరోగ్య సంబంధ తోడ్పాటు అవసరమని ఈ పరిశోధన స్పష్టం చేసిందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని