కందూరులో వెయ్యేళ్ల చరిత్ర కనుమరుగు
close

ప్రధానాంశాలు

కందూరులో వెయ్యేళ్ల చరిత్ర కనుమరుగు

చెల్లాచెదురుగా పడి ఉన్న అరుదైన శిల్పాలు

తెలంగాణ చరిత్రకారులు మహబూబ్‌నగర్‌ జిల్లా కందూరు పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న వెయ్యేళ్లనాటి చారిత్రక శిల్పాలను గుర్తించారు. స్థానిక సర్పంచి శ్రీకాంత్‌ ఇచ్చిన సమాచారంతో బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్‌, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి మంగళవారం చారిత్రక ఆలయాలు, శిల్పాలు, పరిసరాల్ని పరిశీలించారు. ‘కల్యాణి చాళుక్య,  కాకతీయుల సామంతులుగా కందూరు చోళులు క్రీ.శ.1025-1248 మధ్య స్వతంత్రపాలన సాగించారు. నాటి ఇనుపయుగంలో ఎవరైనా చనిపోతే మృతదేహంతోపాటు వాళ్లు వాడిన ఆయుధాల్ని, పనిముట్లనూ నిక్షిప్తం చేసేవారు. రాకాసిగుళ్లుగా పిలుస్తున్న నాటి సమాధులు ఇక్కడ కేవలం నాలుగే మిగిలాయి. రామలింగేశ్వర ఆలయం దగ్గరలో 12వ శతాబ్దికి చెందిన కళ్యాణిచాళుక్య శిల్పశైలికి అద్దంపట్టే అపురూప చెన్నకేశవ శిల్పం, శివలింగాలు పడి ఉన్నాయి’ అని ఆయన ఆవేదన చెందారు.  

-ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అడ్డాకుల


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని