బండరాళ్లపై భారీ వృక్షాలు..!
close

ప్రధానాంశాలు

బండరాళ్లపై భారీ వృక్షాలు..!

ఈనాడు, వరంగల్‌: మనసుంటే మార్గం ఉంటుంది. మొక్కలు పెంచాలన్న సంకల్పం ఉంటే బండలు, కొండలు కూడా అడ్డుకావని నిరూపిస్తున్నారు తెలంగాణ అటవీ శాఖ అధికారులు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామ సమీపంలో అటవీ శాఖ మొక్కలను వినూత్నంగా పెంచుతోంది. ఇక్కడి కొండపై ఉన్న బండరాళ్లపై 500 సిమెంటు తొట్టెలు ఏర్పాటు చేసి అందులో మర్రితో పాటు వివిధ రకాల మొక్కలను నాటారు. మూడేళ్లలో అవి ఏపుగా పెరిగాయి. మరో రెండు మూడేళ్లలో పెద్ద చెట్లలా మారి బండలపై వేళ్లూనుకొని దృఢంగా మారనున్నాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కోల్పోయిన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా పెంచుతున్న అటవీ ప్రాంతం. అటవీ సంపద, నీటి వసతి పెరగడంతో పక్కనున్న ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంట్లు కూడా ఇక్కడ సంచరిస్తున్నాయని రేంజ్‌ అధికారి అఖిలేశ్‌ గౌడ్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని