తూనీగ.. రంగేసుకొచ్చావా

ప్రధానాంశాలు

తూనీగ.. రంగేసుకొచ్చావా

చిత్రంలో నలుపు, పసుపు వర్ణాల రెక్కలతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది సీతాకోక చిలుక కాదు.. అదో రకం రంగు రెక్కల తూనీగ.. రెండు జతల రెక్కలతో మెల్లమెల్లగా ఎగిరే ఇవి చూపరులను సీతాకోకచిలుకలుగా భ్రమింపజేస్తాయి.. ఈ చిత్రంలోనిది మగ తూనీగని, ఆడ తూనీగలకైతే రెక్కలపై మచ్చలు ఎక్కువగా ఉంటాయని జడ్చర్లలోని బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జీవశాస్త్ర సహాయ ఆచార్యులు బక్షి రవీందర్‌రావు తెలిపారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ తూనీగ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కులో కనువిందు చేసింది.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని